Why Pawan Kalyan Silent : పవన్ సైలెంట్ అయిపోయాడేంటి..?

రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ సైలెంట్

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 11:02 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైలెంట్ అయ్యాడేంటి..? ప్రస్తుతం ఏపీలో ప్రజలు , పార్టీ కార్యకర్తలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ సైలెంట్ (Pawan Kalyan Silent) అవ్వడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు (Pawan Movies) మరోపక్క రాజకీయాలు (Pawan Politics) చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఎన్నికల సమయం నాటికీ పూర్తిగా రాజకీయాల్లో బిజీ కావాలని పవన్ చూస్తున్నారు.

ప్రజలు , కార్యకర్తలు మాత్రం రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ లో వారాహి విజయయాత్ర (Varahi Vijaya Yatra) ను పవన్ చేపట్టగా ఆ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి జనసైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కల్యాణ్. ఫ్యామిలీతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగివచ్చాక సినిమా షూటింగ్ లలో బిజీ అయ్యారు. మరో రెండు వారాల పాటు సినిమా షూటింగ్ లతో పవన్ గడపనున్నారని తెలుస్తుంది. అయితే డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం రాజకీయ వర్గాలను , జనసేన (Janasena) శ్రేణులను ఆలోచనలో పడేస్తుంది.

Read Also : By Poll – 6 States : 7 బైపోల్స్ కౌంటింగ్ షురూ.. ఏ స్థానంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. ?

మరికొంతమంది మాత్రం ఈ నెల చివరి వారంలో మరోసారి పవన్ వారాహి యాత్ర తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని అంటున్నారు. విశాఖ సిటీలో యాత్ర పూర్తయినందున ఈ సారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతీ నెలా రెండు వారాలు సినిమా షూటింగ్‌లకు కేటాయించాలని ఇది వరకే నిర్ణయించారు. ఎన్నికలకు ముందే ఓజీ, ఉస్తాద్ సినిమాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ లోనూ పొలిటికల్ పంచ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా జనసేనకు ప్రచారం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సగం రోజులు షూటింగ్‌లకు సగం రోజులు రాజకీయాలకు పవన్ కేటాయించారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ ప్రజల మధ్య ఉంటేనే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.