Kesineni: అలిగిన ఆ ఎంపీని బుజ్జగిస్తారా..?లైట్ తీసుకుంటారా..?

సీనియర్ నాయకుడు కేశినేని నానికి బెజవాడలో వర్గపోరు తప్పడం లేదా..?ఆయన్ను కాదని మిగిలిన నాయకులంతా ఒక్కటయ్యారా?

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 11:40 AM IST

సీనియర్ నాయకుడు కేశినేని నానికి బెజవాడలో వర్గపోరు తప్పడం లేదా..?ఆయన్ను కాదని మిగిలిన నాయకులంతా ఒక్కటయ్యారా? అందులో బుద్దావెంకన్న, నాగులో మీరా, బోండా ఉమాదేవినేని ఉమా…వీళ్లంతా ఒకవర్గంగా ఉంటూ పార్టీ ఎంపీనే వ్యతిరేకిస్తున్నారు. కేశినాని కుమార్తెను గతేడాది జరిగిన మేయర్ ఎన్నికల్లో పోటీగా నిలబెడితే ఆమె అభ్యర్థిత్వం విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. నాని కూతురు గెలుపు కోసం పార్టీ నాయకులే పనిచేయలేదని…ఎంపీ అభియోగం చేశారు. అంతేకాదు ఎంపీని నువ్వెంత అంటూ గట్టిగానే సొంతపార్టీనేతలు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా హైకమాండ్ వారికి నచ్చచెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మహానాడుకు కేశినేని హాజరుకాలేదు. ఇక్కడ మహానాడు పెట్టుకుని…ఆయన ఢిల్లీలో మకాం పెట్టారు.

ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ముగ్గురు ఎంపీలు ఉంటే వారిలో నాని డుమ్మా కొట్టడం..పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇవి పక్కన పెడితే…రానున్న ఎన్నికల్లో నానికి టికెట్ దక్కదన్న ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా వచ్చిన సర్వేలు చూస్తే వైసీపీ ఎంపీలతోపాటు, వ్యతిరేకత ఉన్న ఎంపీగా కేశినేని నాని పేరు వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూసి నాని పార్టీకి దూరంగా ఉంటున్నారా చర్చ కూడా సాగుతోంది. కాగా నాని తమ్ముడు చిన్నని లోకేష్ ప్రోత్సహిస్తున్నారని టాక్. దీంతో చిన్ని బెజవాడ బాధ్యతలు భుజాన వేసుకుని కష్టపడుతున్నారని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎంపీ అభ్యర్థి అవుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ బిల్డర్ గా పేరున్న చిన్ని ఇప్పుడు విజయవాడ టీడీపీలో తన మార్క్ కోసం హడావుడి చేస్తున్నారట. అన్న మహానాడుకు డుమ్మ కొడితే తమ్ముడు సందడి చేశారు. మొత్తానికి లోకేశ్ బాబు చల్లనిచూపు…చిన్ని మీద ఉంటుందని అంటున్నారు. అలిగిన నానిని బుజ్జిగిస్తారా లేదా లైట్ తీసుకుంటారన్నది పార్టీలో చర్చ నడుస్తుందట.