TDP: చంద్ర‌బాబుకు గంటా బిగ్‌ హ్యాండ్.. అస‌లు కార‌ణం అదేనా..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఏపీలోని 12 నియోజ‌క వ‌ర్గాల నేత‌లు స‌మావేశం కావాల‌ని ముందుగానే ఆహ్వానం పంపారు. అయితే ఈ స‌మావేశానికి గంటా శ్రీనివాస్ గైర్హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు క‌బురు పంపిన గంటా శ్రీనివాస్, ఇప్ప‌టికే తాను కొన్ని కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాన‌ని, దీంతో స‌మావేశానికి రాలేక‌పోతున్నాన‌ని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి స‌మాచారం ఇచ్చారు. ఇక‌పోతే గత కొంతకాలంగా గంటా శ్రీనివాస్ టీడీపీ పార్టీకి ఉంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. నార్త్ […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu Ganta Srinivas

Chandrababu Ganta Srinivas

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఏపీలోని 12 నియోజ‌క వ‌ర్గాల నేత‌లు స‌మావేశం కావాల‌ని ముందుగానే ఆహ్వానం పంపారు. అయితే ఈ స‌మావేశానికి గంటా శ్రీనివాస్ గైర్హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు క‌బురు పంపిన గంటా శ్రీనివాస్, ఇప్ప‌టికే తాను కొన్ని కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాన‌ని, దీంతో స‌మావేశానికి రాలేక‌పోతున్నాన‌ని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి స‌మాచారం ఇచ్చారు.

ఇక‌పోతే గత కొంతకాలంగా గంటా శ్రీనివాస్ టీడీపీ పార్టీకి ఉంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. నార్త్ విశాఖ నియోజకవర్గంలో యాక్టీవ్‌గానే ఉన్నా, పార్టీ పరంగా మాత్రం గంటా పెద్దగా యాక్టివ్‌గా లేరనే చెప్పాలి. ఇప్ప‌టికే గంటా శ్రీనివాస్‌ పార్టీ మారతారనే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ అధినేత చంద్ర‌బాబా మీటింగ్‌కు డుమ్మా కొట్ట‌డంతో, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే గంటా శ్రీనివాస్‌ను టీడీపీలో ఓ వర్గం గంటాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవకాశవాద రాజకీయాలు చేసే గంటా శ్రీనివాస్‌కు ప్రాధాన్యం ఇస్తే సహించేది లేద‌ని కొంద‌రు టీడీపీ త‌మ్ముళ్ళు చంద్ర‌బాబుతో చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు వెలగపూడి రామకృష్ణ, అయ్యన్నపాత్రుడు లాంటివాళ్ళు టీడీపీ అధిష్టానాని గంటా విషయంలో అల్టిమేటం కూడా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో భ‌విష్య‌త్తులో త‌న‌కు టీడీపీలో ప్రాధాన్య‌త ఉంటుందో లేదో అనే డౌట్‌లో ఉన్నార‌ట‌.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ,జ‌న‌సేలు క‌లిస్తే జ‌న‌సేన త‌రుపున పోటీ చేయాల‌ని గంటా భావిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గంటా టికెట్ ఇస్తారా అనేది అపేమాన‌మె. దీంతో ముందుగానే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి, టికెట్ గురించి చ‌ర్చించిన త‌ర్వాతే టీడీపీ అధిష్టానాన్ని కలవాలని గంటా శ్రీనివాస్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. అయితే మ‌రోవైపు గంటాకు చంద్ర‌బాబు అండ్ లోకేష్‌లు ఎక్కువ‌గానే ప్రాధాన్యం ఇస్తారు. అయినా కూడా స‌మావేశానికి రాకుండా చంద్ర‌బాబుకు హ్యాండ్ ఇచ్చాడ‌ని రాజకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పార్టీ లేదు బొక్కా లేద‌ని టీడీపీ నేత‌లే అంటున్న క్ర‌మంలో గంటా శ్రీనివాస్ స‌మావేశానికి వ‌చ్చినా పెద్ద‌గా చేసేది ఏం లేద‌ని కొంద‌రు టీడీపీ త‌మ్ముళ్ళు అంటున్నారు.

  Last Updated: 19 Feb 2022, 04:51 PM IST