Pawan Kalyan Letter : జనసేన శ్రేణులకు పవన్ లేఖ ఎందుకు రాశారు ? కారణమేంటి ?

ఈ తరుణంలో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan Letter) దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Janasena Chief Pawan Kalyan Letter To Janasena Cadre

Pawan Kalyan Letter : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  తన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘‘అనవసర తగాదాలు పెట్టుకోవద్దు.. అనవసర చర్చలకు దిగొద్దు’’ అని పార్టీ శ్రేణులకు ఆయన కీలక సూచన చేశారు. ఇంతకీ పవన్ కళ్యాన్ ఎందుకీ లేఖ రాయాల్సి వచ్చింది ? కారణాలు ఏమిటి ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read :Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దొద్దు – నాగబాబు స్వీట్ వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా..

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీలోని పలువురు నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. నెక్ట్స్ సీఎం లోకేశ్ కావాలి అని కూడా అంటున్నారు. చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేశ్ మాత్రమేనని తేల్చి చెబుతున్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన వారిలో పలువురు ఏపీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే వారిని సీఎం చంద్రబాబు మందలించినట్లు  తెలిసింది.  ఇక ఇదే సమయంలో జనసేన క్యాడర్‌లోని పలువురు సోషల్ మీడియా వేదికగా మరో ప్రచారాన్ని ప్రారంభించారు.  పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌ను వినిపించారు. దీంతో టీడీపీ క్యాడర్‌లో ఆగ్రహావేశాలు పెరిగాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan Letter) దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు. సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలని జనసేన శ్రేణులకు సూచించారు. అతిగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకూడదన్నారు.

Also Read :CBN Presentation : 7 నెలలు.. రూ.6.33 లక్షల కోట్లు.. 4.1 లక్షల ఉద్యోగాలు..ఇదిరా బాబు అంటే

నాకు సైతం పదవుల మీద ఆశ లేదు

‘‘నాకు సైతం పదవుల మీద ఆశ లేదు. కష్టపడి పనిచేయడం ఒక్కటే తెలుసు’’ అని  లేఖలో పవన్ స్పష్టం చేశారు. ఏపీలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. వైఎస్సార్ సీపీ పాలనపై ప్రజల్లో ఉన్న  వ్యతిరేకతే తమకు కలిసి వచ్చిందనే విషయాన్ని జనసేన నాయకులకు గుర్తు చేసేందుకు పవన్ ప్రయత్నించారు.ఈ వ్యవహారం పెద్దదైతే ఏపీలోని కూటమి ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినే ముప్పు ఉంటుందని గ్రహించబట్టే  పవన్ ఈ లేఖను రిలీజ్ చేశారని తెలిసింది. పవన్ మాటను జనసైనికులు ఒక శాసనంలా భావిస్తుంటారు. అయితే ఈ లేఖ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

  Last Updated: 28 Jan 2025, 08:30 AM IST