ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (AP Govt) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫోటోలు (Jagan Photos) కనిపించడం పలు విమర్శలకు దారితీస్తోంది. సాంప్రదాయంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోటోలు అమర్చే పరిపాటిని పాటిస్తారు. కానీ ఇప్పటికీ కొంతమంది అధికారుల కార్యాలయాల్లో జగన్ ఫోటోలు ఉండటం పై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
CBN New House : చంద్రబాబు నూతన ఇంటి గృహప్రవేశంలో పుంగనూరు ఆవులు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా..?
ఈ అంశంపై మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు (MLA M.S. Raju) తీవ్రంగా స్పందించారు. “జగన్‌పై భక్తి ఉంటే ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకోండి కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచొద్దు” అంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మాజీ సీఎంకి విధేయత చూపడం తగదని, ఇకపై ఇటువంటి ఘటనలు మళ్లీ కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా ప్రభుత్వ పరిపాలనలో తగిన సమయానికి మార్పులు చేయకపోతే, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని రాజు పేర్కొన్నారు.
అంతేకాక పాత ప్రభుత్వపు అవినీతిపై ఇప్పటికీ విచారణలు సాగుతున్న వేళ, అధికారుల నిర్లక్ష్యం పై ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేయోభిలాషులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం ఎగుమతులు, మాజీ మంత్రులపై కేసుల వంటి అంశాల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోవడమే కాకుండా, కీలక నిర్ణయాల్లో స్ధిరంగా వ్యవహరించకపోవడం వల్లే ప్రభుత్వ అధికార వ్యవస్థలో కొందరు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.