Site icon HashtagU Telugu

MOU : ఏపీ ఒక్క ఎంవోయూ కూడా ఎందుకు చేసుకోలేదు..?

Cbn Mou

Cbn Mou

నాల్గు రోజుల పాటు జరిగిన దావోస్ పర్యటన (Davos Tour) లో ఏపీ(AP) ఒక్క ఎంవోయూ (MOU) కూడా చేసుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు , లోకేష్ (Chandrababu & Lokesh)ఇద్దరు అగ్ర సంస్థలతో సమావేశాలు , ఏపీ వాతావరణం, అభివృద్ధి ఇలా అన్ని తెలిపారు. చాల సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. అయితే ఒక్క సంస్థతో కూడా ఎంవోయూ చేసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్నాయి. పక్క రాష్ట్రమైన తెలంగాణ గత రికార్డ్స్ బ్రేక్ చేశామని , లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారం చేస్తుంటే..చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటి అని కూటమి శ్రేణులు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు.

Royal Enfield Scram 440: రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స‌రికొత్త బైక్‌.. ధ‌ర ఎంతంటే?

కానీ చంద్రబాబు లెక్క మాత్రం వేరేలా ఉందని తెలుస్తుంది. గతంలో చంద్రబాబు దావోస్ ఎప్పుడు వెళ్లినా వేలు, లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావుడి చేసేవారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మాములుగా దావోస్ పర్యటలో ఎన్నో సంస్థలు వస్తాయి. వారితో రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాలు జరిపి తమ రాష్ట్ర అనుకూలతలు తెలిపి ఒప్పందాలు చేసుకుంటాయి. కానీ ఆలా చేసుకున్న వారంతా వచ్చి పెట్టుబడులు పెడతారనేది నమ్మకం లేదు. అందులో కొన్ని సంస్థలు మాత్రమే పెట్టుబడులు పెడతాయి. దావోస్ లో ఒప్పందాలు చేసుకోవడం జస్ట్ నామమాత్రమే. ముందస్తుగా చర్చలు పూర్తి చేసుకున్న ఒప్పందాలు ఉంటే అక్కడ పత్రాలు మార్చుకుంటారు. అంతే తప్ప పూర్తిస్థాయిలో ఒప్పందం జరిగినట్లు కాదు. అందుకే చంద్రబాబు ముందుగా రాష్ట్ర అనుకూలతలు తెలిపి..వారిని రాష్ట్రానికి ఆహ్వానించి..ఆ తర్వాత పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఒప్పందాలు చేసుకొని , ఆ తర్వాత వారు పెట్టుబడులు పెట్టకపోతే పరువు పోతుందని..అందుకే పెట్టుబడుల ఒప్పందాలు ఏపీలోనే జరిపి అప్పుడు అధికారిక ప్రకటన చేయాలనీ బాబు భావించాడు. అందుకే ఎవరితో ఎంవోయూ లు చేసుకోలేదని వినికిడి. ఇది తెలియక వైసీపీ నేతలు నోర్లు పారేసుకుంటున్నారు.