Site icon HashtagU Telugu

AP Results : బాబాయ్ ఏపీలో ఎవరు గెలుస్తారంటావ్..?

Ap Results

Ap Results

ఇప్పుడు ఎక్కడ చూసిన..ఎవర్ని పలకరించిన..ఎవరి నోటా విన్న ఒకే ఒక మాట ఏపీలో ఎవరు గెలుస్తారంటావ్..ఇదే వినిపిస్తుంది. గత ఎన్నికలు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క గా మారింది. రాజన్న కొడుకు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామని గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యి..ఏకంగా 151 సీట్లలో గెలిపించి టీడీపీ తలెత్తుకోకుండా చేసారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టం చేస్తున్నారు టీడీపీ నేతలు.

అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని..కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు సైతం వచ్చి ఓటు వేశారని..ఇదంతా కూటమి కోసమే అని కూటమి నేతలు అంటున్నారు. ,మరోపక్క వైసీపీ శ్రేణులు సైతం జగన్ అందించిన సంక్షేమ పథకాలే మరోసారి వైసీపీ ని గెలుపించబోతున్నాయని అంటున్నారు. ఇలా ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా గా ఉండగా..ఎగ్జిట్ పోల్స్ సైతం రెండు రకాలుగా తమ సర్వేలు ఇవ్వడం తో మరింత టెన్షన్ గా మారింది. ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్​లో కొందరు ఈ ఫలితాలు ఎగ్జైట్​మెంట్​ను తట్టుకోలేక మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు ఉండడంతో సొంత నియోజకవర్గాలకు బయల్దేరుతున్నారు. గతంలో ఓట్లు వేయడానికి వెళ్లి, ఫలితాల కోసం మీడియాలో తెలుసుకునేవారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు వేరే లెవల్​లో ఉన్నాయి. గెలుపు సంబురాలను తమ వారితో చేసుకోవాలని వాహనాలు, రైళ్లు, బస్సుల్లో సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. అలాగే ఆంధ్రాలోని తన మిత్రులకు ఫోను చేసి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశాలపై ఆరాతీస్తూ, బెట్టింగ్​కు సరైన నమ్మకం లేక తికమక పడుతున్నారు హైదరాబాద్ వాసులు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారికి ఫోను చేసి వరసలు కలుపుతూ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఆరా తీస్తున్నారు. మీ వాళ్లు అక్కడ ఉన్నారు కదా ఫోను చేసి కనుక్కోండి అంటున్నారు. మరి ఫలితాలు ఎవరికీ సపోర్ట్ గా వస్తాయో..చూడాలి.

Read Also : Election Counting : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్..