Site icon HashtagU Telugu

RGV Vs AP Govt : హూ కిల్డ్ టాలీవుడ్‌

Varma

Varma

విచిత్ర‌మైన ట్వీట్ ను సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ టాలీవుడ్ కు సంధించాడు. ఆన్ లైన్ టిక్కెటింగ్‌, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించిన ఇష్యూపై ఆయ‌న ట్వీట్ ఆలోచింప చేస్తోంది. జీవో నెంబ‌ర్ 142, 35 ల‌ను ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. సోమ‌వారం స‌మాచార‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానితో వ‌ర్మ భేటీ అయ్యాడు. అక్క‌డ ఏమి మాట్లాడాడో..స్ప‌ష్టంగా ఆయ‌న చెప్ప‌డంలేదు. కానీ, హూ కిల్డ్ క‌ట్ట‌ప్ప..అంటూ ట్వీట్ చేయ‌డాన్ని త‌ర‌చిచూస్తే…ఆ జీవోల వెనుక టాలీవుడ్ పెద్ద‌లు ఉన్నార‌నే సంకేతం మాత్రం వ‌స్తోంద‌ట‌.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ జారీ చేసిన జీవోల కంటే ముందు జ‌రిగిన చ‌రిత్ర వ‌ర్మ‌కు బోధ‌ప‌డింది. మంత్రి పేర్ని నాని మొత్తం వ్య‌వ‌హారాన్ని ఆధారాల‌తో స‌హా ఆయ‌న‌కు వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో బిక్క‌మొహం వేసుకుని వ‌ర్మ వెనుతిరిగాడని టాలీవుడ్ టాక్‌. ఆ రెండు జీవోల జారీపై ఇప్ప‌టికీ టాలీవుడ్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఐక్యంగా ఏపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్ట‌డంలేదు. నిర్మాత న‌ట్టి కుమార్ లాంటి వాళ్లు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. టాలీవుడ్ పెద్ద‌లుగా ఫోక‌స్ అవుతున్న వాళ్లు మౌనంగా ఉన్నారు. హీరోలు నంద‌మూరి బాల‌క్రిష్ణ‌, నాగార్జున లాంటి వాళ్లు సినిమాల‌ను విడుద‌ల చేసుకున్నారు. ఏపీ స‌ర్కార్‌ నిర్ణ‌యం కార‌ణంగా సినిమాపై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని బంగార్రాజు సినిమాను నాగార్జున విడుద‌ల చేస్తున్నాడు. ఇటీవ‌ల అఖండ సినిమాను బాల‌య్య విడుద‌ల చేశాడు.

హైకోర్టు ఆదేశం మేర‌కు రెండు జీవోల‌పై ప్ర‌త్యేకమైన క‌మిటీని ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణ‌యం తీసుకోవాడ‌నికి ఏపీ స‌ర్కార్ సిద్ధంగా ఉంది. ఆ విష‌యాన్ని వ‌ర్మ‌కు మంత్రి నాని చెప్పాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు, చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి, న‌ట్టికుమార్‌, సురేష్ బాబు త‌దిత‌రులు ఒక బృందంగా గ‌త ఏడాది సీఎం జ‌గ‌న్ ను కలిశారు. ఆ సంద‌ర్భంగా వాళ్లు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను వ‌ర్మ‌కు చూపించాడ‌ట‌. వాళ్లిచ్చిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు జీవోల‌ను తీసుకొచ్చామ‌ని వివ‌రించ‌డంతో వ‌ర్మ‌కు మైండ్ బ్లాక్ అయింద‌ని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వ‌ర్మ హూ కిల్డ్ క‌ట్ట‌ప్ప అంటూ ట్వీట్ చేశాడ‌ని ఆయ‌న అభిమానుల‌ అభిప్రాయం. సో..ఎవ‌రు టాలీవుడ్ ను కిల్ చేశారో..మీరే తేల్చుకోండి.!