Site icon HashtagU Telugu

#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?

Geethanjali Tdp

Geethanjali Tdp

గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది.

తెనాలిలోని ఇస్లాం పేటకు చెందిన గీతాంజలి దేవి (29) ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. దీంతో ఆమె తన సొంతింటి కల నెరవేరిందని సంబరపడుతూ..తన సంతోషాన్ని మీడియా కు వ్యక్తం చేసింది. అంతే దీనిపై కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేసారు. ఈ ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య కు పాల్పడింది.ఈమె మరణం తో ఆ ఇద్దరు బిడ్డలు తల్లిలేని పిల్లలు అయ్యారు. ఈ ఘటన తో ఆ ప్రాంతమే కాదు రెండు తెలుగు రాష్టాల ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. #JusticeForGeethanjali #WeStandWithGeethanjali అనే యాష్ ట్యాగ్ లతో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన రాజకీయంగా పెను సంచలనంగా మారింది. గీతాంజలి మృతికి కారణం టీడీపీ – జనసేన పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. వైసీపీ శ్రేణులు సైతం టీడీపీ – జనసేన ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో సెన్సేషనల్ అంటూ ఓ పోస్ట్ చేసింది. ‘గీతాంజలిని ఎవరు తోసేశారు? వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలి’ అని ఆమె ఆత్మహత్యాయత్నం నాటి సమయంలో తీసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో ‘ ఏంటి మాయ్యా అక్కడ ..? ఎవరు ఇద్దరు నెట్టేశారంట..ఆ అమ్మాయిని పట్టాల మీదకి అవునా..? ఎవరు నెట్టేశారంట మాయ్యా..? ఏమో మరి నెట్టేసి పారిపోయారంట..బ్రతికే ఉందా ఇంకా..ఆ ప్రాణం ఉంది..తీసుకెళ్లారా ఏంటి హాస్పటల్ కి ” అంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునట్లు ఆ వీడియో లో ఉంది.

మరి నిజంగా గీతాంజలిని ట్రాక్ పైకి తోసేసారా..? ఎవరు తోసి ఉంటారు..? అంత అవసరం ఎవరికీ ఉంది..? తోసేసి టైం లో చుట్టుపక్కల ఎవరు లేరా..? టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా..? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ ఘటన ఫై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు జగన్‌. ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని, గీతాంజలి మృతికి కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టంచేశారు.

https://twitter.com/JaiTDP/status/1767565166374502742?

Read Also : KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్