Site icon HashtagU Telugu

RGV: ఈ ముగ్గురిలో నాయకుడు ఎవరు?

RGV

Rgv (1)

RGV: ఏపీ రాజకీయాలపై ఎప్పుడూ ఎదో ఒక కామెంట్ చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. రాజకీయాలు అంటే ఇష్టం లేదంటూనే ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇస్తుంటాడు ఆర్జీవీ. వాస్తవానికి సీఎం జగన్ అభిమానిగా చెప్పుకుంటున్న వర్మ వ్యూహం పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు. సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. అందులో భాగంగా ఆర్జీవీ ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి చర్చించాడు. వ్యూహం చిత్రం ద్వారా టీడీపీ, జనసేనలను టార్గెట్ చేయనున్నాడన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నేపథ్యంలోనే వ్యూహం తెరకెక్కిస్తున్నట్టుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆర్జీవీ ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

చంద్రబాబు సొంత కొడుకును ఎమ్మెల్యే గా గెలిపించుకోలేక పోయాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేక పోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ స్కూటర్ పై తిరిగే కార్యకర్తను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపాడు. ఈ ముగ్గురిలో నాయకుడు అని ఎవరిని అంటారు అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట్ చర్చకు దారి తీసింది. చంద్రబాబు లోకేష్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు అన్నది అందరికీ తెలుసు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడన్నది కూడా తెలుసు. అయితే ఈ సమయంలో ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఆర్జీవీ వ్యూహం ఏంటనేది ఆయనకే తెలియాలి.

Read More: Railways Fares Cut : ఆ టికెట్ల రేట్లు 25% తగ్గించిన రైల్వే

Exit mobile version