Site icon HashtagU Telugu

YS Vijayamma : తల్లి విజయమ్మ కొడుకును సపోర్ట్ చేస్తుందా..? కూతుర్నా..?

Who Does Ys Vijayamma Suppo

Who Does Ys Vijayamma Suppo

వైస్ విజయమ్మ (YS Vijayamma) కు పెద్ద కష్టం వచ్చిపడింది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడబోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె వైస్ ఫ్యామిలీ నుండి ఇద్దరు రెండు వేరువేరు పార్టీల నుండి బరిలోకి దిగుతుండడం ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.

కొద్దీ రోజుల క్రితం వైస్ షర్మిల..తన YSRTP పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..తాను కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన వెంటనే ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అధిష్టానం ప్రకటించబోతుందని ప్రచారం ఉపంచుకుంది. అలాగే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు..వైసీపీ నేతలు సైతం షర్మిల వెంట నడుస్తామని ప్రకటించారు. తాజాగా నిన్న కాంగ్రెస్ షర్మిల ను ఏపీ అద్యక్షురాలిగా ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఇప్పుడు వైస్ విజయమ్మ కు పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటి వరకు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో , జగన్ ఏపీ రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు..ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడం తో విజయమ్మ ఇద్దర్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒకే రాష్ట్రంలో రెండు వేరు వేరు పార్టీలలో ఉండడం..ఎన్నికల బరిలో ఇద్దరు నిల్చోవడం తో విజయమ్మ కు ఇబ్బంది గా మారే అవకాశం ఉంది.

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో షర్మిల రెడీ అయ్యింది. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపిస్తూ వచ్చింది. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్‌ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్‌ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మరి విజయమ్మ ఏంచేస్తుందో..? ఎవరికీ సపోర్ట్ చేస్తుందో..? అసలు ఎవరికీ సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉంటుందో చూడాలి.

Read Also : Villagers Return : పట్నానికి పయనమైన పల్లె వాసులు