AP Politics: ఆ ఇద్దరు ఎవరు? పట్టుకోండి చూద్దాం!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం మొదటి ప్రాధాన్యత ఓటులోనే లభించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ..

  • Written By:
  • Updated On - March 24, 2023 / 12:46 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం(AP Politics) మొదటి ప్రాధాన్యత ఓటులోనే లభించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి కి గట్టి షాక్‌ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న టీడీపీ మరోసారి తన సత్తా చాటినట్లయింది.

శాసనసభలో తనకున్న బలాన్నిబట్టి తెదేపా ఒక అభ్యర్థిని మాత్రమే (AP Politics)

మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా శాసనసభలో(AP Politics) తనకున్న బలాన్నిబట్టి తెదేపా ఒక అభ్యర్థిని మాత్రమే పోటీకి నిలబెట్టింది. మొత్తం 7 స్థానాలకు 8 మంది పోటీపడిన వేళ గెలుపెవరిది? అనే అంశం ఆసక్తి రేకెత్తించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్‌ తిన్న వైసీపీ ఏడుకు ఏడు స్థానాలు కైవసం చేసుకోవాలని పంతం పట్టింది. ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా జాగ్రత్త పడింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠ మధ్య పోలింగ్‌ జరగ్గా తెదేపా గెలిచింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీలను కోల్పోయిన వైసీపీ ఇది మరో షాక్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : Anuradha @ TDP: చంద్రబాబు సంచలనాల్లో అనురాధ ఎపిసోడ్

ఫలించిన టీడీపీ వ్యూహం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ అదే ఉత్సాహంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, టీడీపీ టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్‌ జారీ చేసింది. ఓటు వేయడంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ఇప్పటికే రెండు, మూడు దఫాలు నమూనా పోలింగ్‌ నిర్వహించింది.

ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనూరాధ విజయం 

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. తెదేపా అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీ బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం శాసనసభలో టీడీపీ బలం 19కి తగ్గింది. ఆ నలుగురూ సాంకేతికంగా టీడీపీ సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా టీడీపీ విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ, వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనూరాధ(Anuradha) విజయం సాధించి అధికార వైసీపీకి  షాక్‌ ఇచ్చారు.

Also Read:  KCR Delhi Tour: లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం