Site icon HashtagU Telugu

Where is Sajjala : సజ్జల..ఎక్కడ..?

Sajjala Ekada

Sajjala Ekada

సజ్జల రామకృష్ణ రెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎక్కడ…? కొద్దీ రోజులుగా కనిపించడం లేదేంటి..? అసలు ఏపీలో ఉన్నాడా..? లేక విదేశాలకు వెళ్లాడా..? జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన కంటే ఎక్కువగా మీడియా ముందు కనిపించే సజ్జల..ఓటమి తర్వాత అసలు మీడియా ముందుకు రావడం లేదేంటి..? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిత్యం మీడియా ముందు కనిపిస్తూ..అన్ని శాఖల మంత్రుల వ్యవహారాలు మొత్తం ఈయనే చూస్తూ వచ్చాడు..మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొడాలి నాని, పేర్నినాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటివారు గతంలో వైసీపీ తరుఫున ప్రెస్‌మీట్లు పెట్టేవారు. అయితే, వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ ను తిట్టడానికే పరిమితం అయ్యేవారు. పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ కేబినెట్‌లో మంత్రులుగా చేసినప్పటికీ.. వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధివిధానాలు ఆయనే చెప్పేవారు. కానీ.. అధికారం చేతులు మారిన తర్వాత సజ్జల కనిపించడం లేదు. పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడం లేదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం, పార్టీ ఆఫీసుల కూల్చివేత , జగన్ పథకాల పేర్ల మార్పు వంటి కీలక సంఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపై స్పందించేందుకు సజ్జల రావడం లేదు.

సజ్జల ఎక్కడ కనిపించకపోయేసరికి ఆయన్ను..జగన్ దూరం పెట్టారు కావొచ్చు అని అంత మాట్లాడుకుంటున్నారు. సజ్జల వల్లే జగన్ ఓడిపోయారని..సజ్జల తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈరోజు పార్టీ ఇంత దారుణానికి దిగజారిందని..సజ్జల , ఆయన కొడుకు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలయకుండా సజ్జల చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ కు కలిసేందుకు కూడా అవకాశం లేకుండా ఓ గోడలా సజ్జల అడ్డంగా ఉన్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడినా.. అడ్డుకోవాల్సిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు. ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే..దానికి కారణం సజ్జలే అని అంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు కూడా ఇదే విషయాన్నీ చెప్పడంతో సజ్జల ను దూరం పెట్టారని అంటున్నారు. మరి నిజముగా జగన్ దూరం పెట్టారా..? లేక ఆయనే దూరంగా ఉంటున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Rukhmini Vasanth : రుక్మిణి టీచర్ అవ్వాలనుకుందా.. అలా జరగనందుకు హ్యాపీ అంటున్న ఆడియన్స్..!