మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) కుటుంబం ఎక్కడ..? అని ఇప్పుడు కృష్ణా జిల్లా ప్రజలు , వైసీపీ శ్రేణులే కాదు పోలీసులు సైతం మాట్లాడుకుంటున్నారు. వైసీపీ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు, గత కొద్దీ రోజులుగా అందుబాటులో లేరు. సివిల్ సప్లై గూడెంలో బియ్యం అవకతవకల కేసు నేపథ్యంతో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ, పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. జయసుధతో పాటు పేర్ని నాని పీఏలపై కూడా నిందితులుగా కేసులు నమోదయ్యాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో క్వింటాళ్ల కొద్దీ బియ్యం మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, కేసు వివరాలు ఇంకా సరిగ్గా బయటపడడం లేదు. డిసెంబర్ 10న పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై కేసు నమోదు అయ్యింది. కానీ గడువు ముగిసినా, సంబంధిత వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
గోదాముల్లో భారీ ఎత్తున బియ్యం మాయం అయిన కేసులో వివరాలు సమర్పించాలని, వివరణ ఇచ్చుకునేందుకు పేర్నినానికి, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్ సన్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోగా పీఎస్‌కు వచ్చి వివరాలు సమర్పించాలని శనివారం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం ఇంటికి నోటీసులు అంటించినట్లు తెలుస్తోంది. అయితే గడువు ముగిసినా పేర్నినాని గానీ, ఆయన కుమారుడు గానీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు, వివరాలు సమర్పించకపోవడంతో మాజీ మంత్రి ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజ ఆచూకీ సైతం పోలీసులకు లభ్యం కావడం లేదు. కుటుంబసభ్యులు, స్నేహితులను విచారించినా ప్రయోజనం లేకపోయింది. ఇలా కేసుకు సంబదించిన వారంతా అజ్ఞాతంలోకి వెళ్లడం పోలీసులు మరింత సీరియస్ గా ఉన్నారు.
Read Also : Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం