Whats Today : ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ జరుగుతుంది.
- ఇవాళ విద్యుత్, ఆర్టీసీలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తారు. ఆర్టీసీ ఎండీతో భేటీ అవుతారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లో సమావేశం అవుతారు. విద్యుత్ శాఖ రివ్యూకు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలిస్తారు.
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిలును సవాలు చేస్తూ సీఐడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది.
- ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెబుతారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలేనికి చంద్రబాబు చేరుకుంటారు.
- ఇవాళ విశాఖపట్నంలో ఆర్కే బీచ్‌లో నేవీ డే జరుగుతుంది. ఈసందర్భంగా నేవీ సిబ్బంది యుద్ధ విన్యాసాలు చేస్తారు. ఈరోజు నగరంలో స్కై లాంప్స్, డ్రోన్లు, గాలిపటాలు ఎగుర వేయడంపై నిషేధం(Whats Today) ఉంది.