Whats Today : ఇవాళ టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది. రాష్ట్రానికి చెందిన ఓటర్ల జాబితాలోని అక్రమాలు, ఫామ్ 6, 7 అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీకి వెళ్లే టీడీపీ నేతల బృందంలో యనమల, అచ్చెన్న, పయ్యావుల తదితరులు ఉన్నారు.
- ఇవాళ సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. వాకాడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.94 కోట్లతో పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు ఆర్ధిక సహాయాన్ని సీఎం పంపిణీ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ సీఎం కేసీఆర్ మధిర, వైరాలలో ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటారు.
- ఇవాళ వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్, మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట, సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
- ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తారు.
- ఇవాళ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు.
- ఇవాళ మెదక్ జిల్లాలో టీ-కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి పర్యటిస్తారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ తరఫున ప్రచారం చేస్తారు.
- ఎల్లుండి నుంచి తిరుమల అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం అవుతుంది.
- తిరుమలలో 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం(Whats Today) పడుతోంది.