Whats Today : విశాఖపట్నం రాజధాని అంశంపై తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధానిగా వైజాగ్ కానుంది. ఇప్పటికే వైజాగ్‌లో సీఎం క్యాంప్ కార్యాలయం పనులు పూర్తి కావచ్చాయి. వైజాగ్‌లో తాత్కాలిక వసతి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ సీఎంకు సమర్పించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
- తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది. తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.
- సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పాత మాచారెడ్డి, పాత కామారెడ్డి మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఇవాళ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు.ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.
- జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇవాళ బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
- ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతాలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న బంగ్లాదేశ్‌తో.. ఏమూలో చిన్న ఆశ ఉన్న పాకిస్థాన్ జట్టు అమీతుమీకి సిద్ధమైంది. బంగ్లాపై గెలిచి సెమీస్ రేసులో సజీవంగా ఉండాలని పాక్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడమే తమ లక్ష్యమని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంటున్నారు.
- మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
- ఇవాళ తిరుమలలోని తిరుచానురు పద్మావతి అమ్మవారికి రూ.60 లక్షల విలువైన కాసుల హారాన్ని కంచి పీఠాధిపతి కానుకగా సమర్పించనున్నారు.
- ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గత నెల 9న అరెస్టయిన టీడీపీ చీఫ్ చంద్రబాబు రిమాండ్ గడువు రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట జైలు అధికారులు హాజరుపర్చనున్నారు.
- నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతారు. ఉదయం 11 గంటలకు ములాఖత్ అనంతరం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరి వెళ్తారు. మార్గంమధ్యలో విజయనగరం రైలు ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆమె(Whats Today) పరామర్శిస్తారు.