Whats Today : న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా అమీతుమీ.. బీజేపీ అభ్యర్థుల తుది జాబితాపై క్లారిటీ

Whats Today : ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్‌‌లో ఇవాళ న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా తలపడనున్నాయి. 

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 08:36 AM IST

Whats Today : ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్‌‌లో ఇవాళ న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా తలపడనున్నాయి.  వరల్డ్‌కప్‌ ఆరంభంలో వరుస విజయాలు సాధించి తర్వాత రెండు ఓటములను చవిచూసిన న్యూజిలాండ్‌… పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీఫైనల్ బెర్త్‌ల కోసం రెండు జట్లూ గట్టి పోటీలో ఉన్నందున ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం కానుంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో అయిదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ ఆరు మ్యాచుల్లో 4 విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ సత్తుపల్లి, ఇల్లందులలో జరిగే బీఆర్ఎస్‌ ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
  • ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే 2 జాబితాల్లో 53 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు పోను మిగతా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించనుంది. జనసేనకు 9 లేదా 10 సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇవాళ మధ్యాహ్నం 2.30కి కల్వకుర్తి సభలో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 4.30కి జడ్చర్లలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.15కి షాద్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు పాదయాత్ర చేస్తారు.
  • ఇవాళ ఇద్దరు సభ్యులతో కూడిన  కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లపై వారు సమీక్షించనున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన బృందం ఈరోజు ఉదయం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో భేటీ అవుతుంది. అనంతరం  తనిఖీలు, స్వాధీనాలపై సమీక్షలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమావేశం అవుతుంది.
  • ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ఉదయం 10.15 గంటలకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఇవాళ వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పాల్గొంటారు.
  • ఇవాళ తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటన ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆమె పరిశీలిస్తారు.  అలిపిరిలో టీటీడీ తొలగించే ప్రయత్నంలో ఉన్న శ్రీవారి పాదాల మండపంలో గోపూజ చేస్తారు.
  • విజయనగరం రైలు ప్రమాదం ఎఫెక్ట్‌తో నాలుగో రోజు వాల్తేరు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. ఈరోజు సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూరు మార్గంలో ప్రయాణించే షాలిమార్, కొరమండల్, ఫలక్ నుమా, కోణార్క్, హామ్ సఫర్, దురంతో, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.  పలాస-విశాఖ,విశాఖ-పలాస మధ్య ప్యాసింజర్ సర్వీసు రద్దు అయింది. కిరండోల్ ప్యాసింజర్ గమ్యస్థానాన్ని(Whats Today) కుదించారు.

Also Read: LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సిలిండర్‌పై వంద రూపాయలు పెంపు..!