Whats Today : రాజమండ్రి ఎయిర్‌పోర్టు పనులకు శ్రీకారం.. విజయవాడలో నిర్మలా సీతారామన్

Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకా­దళ ప్రధాన కేంద్రంలో  నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వ­హిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Whats Today

Whats Today

Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకా­దళ ప్రధాన కేంద్రంలో  నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వ­హిస్తారు. ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే జరుపుకుంటాం. ఈసారి మిచాంగ్‌ తుపాను కారణంగా 4న జరగా­ల్సిన వేడు­కల­ను 10కి వాయిదా వేశారు. ముఖ్య అతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌  హాజరు­కానున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు పర్యటిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఖమ్మం, కొత్తగూడెం భద్రాచలంలో పర్యటిస్తారు.
  • ఇవాళ  సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటిస్తారు. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభిస్తారు.
  • ఇవాళ సెక్రటేరియట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.
  • ఇవాళ  విజయవాడ నగరంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తారు.  తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే సంగీత నీరాజనంలో పాల్గొంటారు.
  • ఇవాళ(Whats Today) రాజమండ్రి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేస్తారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు జరుగుతాయి.

Also Read: New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు వేళైంది..!!

  Last Updated: 10 Dec 2023, 07:51 AM IST