Whats Today : మిత్రపక్షం జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీకి బీజేపీ సీట్లను కేటాయించింది. కూకట్‌పల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, మధిర నియోజకవర్గాల్లో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మరో స్థానంపై ఇంకా క్లారిటీ రాలేదు. శేరిలింగంపల్లి సీటును తమకు ఇవ్వాలని జనసేన పట్టుబట్టుతోంది. జనసేనతో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో తన అభ్యర్థుల తుదిజాబితాపై బీజేపీ కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 31 స్థానాల్లో జనసేనకు తొమ్మిది కేటాయించింది. అవి పోగా మిగిలిన 22 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఈరోజు, రేపు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాజేంద్రనగర్‌లో సాధారణం కన్నా 7.1 డిగ్రీలు అధికంగా 24.3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది.
- ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
- ఇవాళ దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణ పేటలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
- ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డిలో కూడా రేవంత్ పోటీ చేస్తున్నారు. ఎంపీ బండి సంజయ్ కూడా కరీంనగర్‌లో ఈరోజు నామినేషన్ వేయనున్నారు.
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు బంగ్లాదేశ్- శ్రీలంక మ్యాచ్ ఉంది. అయితే ఢిల్లీలోని కాలుష్య తీవ్రత కారణంగా ఆ మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
- ఏపీలోని కోనసీమను అతలాకుతలం చేసిన అతిపెద్ద తుఫాను సంభవించి.. నేటికి సరిగ్గా 27 ఏళ్ళు పూర్తయ్యాయి. అప్పట్లో దాదాపు 215 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచి దాదాపు 1077 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు అత్యధికంగా 78 సెంటిమీటర్ల వర్షపాతం సంభవించి 40వేలకుపైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 2.33 లక్షల కుటుంబాల వారు నిరాశ్రయులుగా (Whats Today) మారారు.
Also Read: US Nuclear Submarine : రంగంలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్.. గాజా యుద్ధంలో కీలక పరిణామం