Site icon HashtagU Telugu

Tollywood : ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ స్టాండ్ ఏమిటి ?

Tollywood Politics

Tollywood Politics

Tollywood : తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌పై సినీ నటుల ఎఫెక్ట్ చాలా ఎక్కువ. విఖ్యాత నటుడు, దివంగత  నందమూరి తారక రామారావు రాజకీయాల్లో క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి యావత్ దేశానికి తెలుసు. ఆ మోడల్‌ను ఫాలో కావాలని చాలామంది నటులు ట్రై చేసినా నేటిదాకా ఆ రేంజులో సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే.. ఆనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం వెనుక యాక్షన్ లేదు. ఎమోషన్ మాత్రమే ఉంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఉదయించిన తారగా అప్పట్లో ఎన్టీఆర్ కనిపించారు. దీంతో ఏపీ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఎన్టీఆర్ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చిన వారు ఫక్తు రాజకీయం కోసమే తప్ప ఎజెండా కోసం పనిచేస్తున్నట్టు ప్రజలకు కనిపించడం లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారుతున్న నటులకు రాజకీయ వైఖరిని తీసుకోవడంపై  క్లారిటీ ఉండటం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇన్ స్టంట్ రిజల్టును ఆశించే వాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతున్నారు. రాజకీయం అంటే ‘అధికారం’ ఒక్కటే కాదు.. ‘పదవి’ ఒక్కటే కాదు.. రాజీలేని పోరాటం, సహనం, నిలకడ కూడా ఉండాలని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

దాసరి నారాయణరావు , రావుగోపాల రావు, కృష్ణ, కృష్ణంరాజు, జమున, కైకాల, మురళీ మోహన్, చిరంజీవి, హరికృష్ణ, రామానాయుడు, మోహన్‌బాబు, శారద, జయప్రద, విజయశాంతి లాంటి  ఎందరో నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి లక్కును పరీక్షించుకున్నారు. అయితే తిరుగులేని సక్సెస్ సాధించింది మాత్రం ఎన్టీఆర్‌ ఒక్కరే. వాస్తవానికి ఎన్టీఆర్  కంటే ముందే  1967 సంవత్సరంలో కొంగర జగ్గయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే జగ్గయ్య.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేయాలని భావించలేదు. తన స్థానానికే పరిమితమయ్యారు.

Also Read :TamilNadu Party : తెలంగాణ ఎన్నికల బరిలో తమిళనాడు రాజకీయ పార్టీ

ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కూడిన ఎన్డీయే కూటమిలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేరారు. ఇటీవల ప్రచారంలో పవన్ కల్యాణ్‌ సూపర్ స్టార్ కృష్ణను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై మహేష్‌బాబు మౌనంగా ఉండిపోయారు. నరేష్‌ మాత్రం చురకలు అంటించారు. వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పోసాని దుమ్ము దులుపుతున్నారు. పృథ్వీ జనసేన క్యాంప్‌లో చేరారు. వైసీపీలోనే ఉన్న అలీ ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబం మౌనంగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌గా చెప్పుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచర వర్గాలు మాత్రం తారక్‌ మద్ధతు తమ నేతలకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి బాలకృష్ణ, నారా రోహిత్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా అండదండలు అందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని(Tollywood)  ఓ వర్గం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది.

Also Read :Narmada Pushkaralu 2024 : మే 1 నుంచి నర్మదా పుష్కరాలు.. వీటి ప్రాముఖ్యత ఏమిటి ?