Vijayasai Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా(Vijaya Sai Reddy Announced Retirement from Politics) చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ (Jagan) గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.
జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు (Chandrababu) గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అంటూ విజయసాయి భారీ ట్వీట్ చేసారు.
విజయసాయి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా విజయసాయి వ్యవసాయం చేస్తాడా..? కూటమి ని ఎదురించలేక రాజీనామా చేశాడా..? విజయసాయి రాజీనామా వెనుక బిజెపి వ్యూహం ఉందా..? చంద్రబాబు తో సన్నిహిత్యాలు కారణంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపాడా..? అమిత్ షా , పవన్ కళ్యాణ్ లకు ఎందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజలను రేకెత్తిస్తున్నాయి. 2028 వరకు రాజ్యసభ పదవి కాలం ఉండగా.. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణాలేంటీ అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్..గడిచిన ఐదేళ్లలో జరిగిన వాటికీ బదులు తీర్చుకునే పనిలో ఉంది. గతంలో నోరుపారేసుకున్న వారందరిపై ఇప్పటికే కేసులు పెట్టడం.కొందర్ని జైలుకు సైతం పంపించడం చేసింది. ఇప్పుడు నెక్స్ట్ తానే అనే కేసుల భయంతో విజయసాయి ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది. అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని వాటిపై అనేక విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మద్యం స్కాంతో పాటు వైసీపీకి చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని , ఈ వయసులో కోర్ట్ లు , కేసులు ఇవన్నీ ఎందుకు అని ముందే ఇలా రాజీనామా చేసి అన్నింటికీ దూరం కావాలని భావిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నారా…? ఇలా కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి విజయసాయి రాజీనామా అంశం ఇప్పుడు చర్చగా మారింది.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025