AP Politics: చిరు/పేర్ని #తాడేపల్లి ప్యాలెస్

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన భేటీలోని అసలు రహస్యం ఆలస్యంగా బయటకు వస్తుంది. హాష్ టాగ్ యూ ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పొలిటికల్ కోణాన్ని 'నరసాపురం వైసీపీ అభ్యర్థి చిరు? అనే టైటిల్ తో భేటీ రోజే ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

  • Written By:
  • Updated On - January 23, 2022 / 11:19 AM IST

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన భేటీలోని అసలు రహస్యం ఆలస్యంగా బయటకు వస్తుంది. హాష్ టాగ్ యూ ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పొలిటికల్ కోణాన్ని ‘నరసాపురం వైసీపీ అభ్యర్థి చిరు? అనే టైటిల్ తో భేటీ రోజే ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఆయన తాడేపల్లి , దొక్కిపర్రుకి వెళ్లిన స్పెషల్ ఫ్లైట్ రహస్యాన్ని కూడా బయట పెట్టింది. ఆ విషయాలకు మరింత బలం ఇచ్చేలా మంత్రి పేర్ని నాని తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.
సాధారణంగా విధానపరమైన అంశాలపై చర్చించడానికి సచివాలయం కేంద్రంగా ఉంటుంది. సీఎం అధికారిక సమావేశాలు కూడా అక్కడే జరుగుతాయి. కానీ జగన్ సీఎం అయిన తరువాత ఆయన ఇంటిలోనే కొన్ని సమావేశాలను నిర్వహిస్తున్నాడు. అందుకే ప్రైవేట్ సమావేశాలు ఆయన ఇంటిలో జరుగుతున్నాయని అనుకోలేం. అయితే , మంత్రి పేర్ని నాని మాత్రం జగన్ ఇంటిలో జరిగే సమావేశాలు, సంప్రదింపులను పర్సనల్ భేటీలుగా తేల్చాడు. దానికి ముఖేష్ అంబానీ భేటీని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భేటీని కూడా ఆ కోణం నుంచి చూడాలి. అదే విషయాన్ని మంత్రి కూడా చెబుతున్నాడు.
మెగాస్టార్ చిరు మాత్రం సినిమా టికెట్ల గురించి సంప్రదిపులు జరిపాను అని చెప్పాడు.

పైగా నాలుగు వారాల్లో వివాదం క్లియర్ అవుతుందని సెలవు ఇచ్చాడు. ఆ సందర్భంగా జగన్ ఇచ్చిన విందును, భారతి వడ్డించిన తీరును తెగ మెచ్చు కున్నాడు. ఎవరు ఇక జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని కోరాడు. ఆ మేరకు టాలీవుడ్ అంతా సైలెంట్ అయింది. అయితే , ఇప్పుడు మంత్రి పేర్ని నాని చెప్పిన మాటల ప్రకారం చిరు, జగన్ మధ్య భేటీ పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. విందు కోసం జగన్ చిరును ఆహ్వానించాడు. ఆ మేరకు స్పెషల్ ఫ్లైట్ లో తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్ళాడు. అక్కడ జగన్ తో కుశల ప్రశ్నలు వేసాడు. సరదాగా వాళ్లిద్దరూ పండుగ సందర్భంగా మాట్లాడుకున్నారు. భారతి పెట్టిన భోజనం రుచి చూసి కితాబు ఇచ్చాడు చిరు. ఇంతకు మించి అధికారిక భేటీ వాళ్లిద్దరి మధ్యా జరగ లేదని సమాచారశాఖ,సినిమాటోగ్రఫీ మంత్రి చెబుతున్నాడు. ఒక వేళ చిరంజీవి భేటీ టిక్కెట్లు ఇష్యూ మీద అయితే సచివాలయంలో జరిగేది కదా అంటూ మీడియా కళ్ళు తెరిపించాడు పేర్ని నాని.
ఇక ఇప్పుడు జగన్, చిరు మధ్య భేటీ వెనుక ఏమి జరిగి ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే రాజ్యసభ సీట్ లేదా నరసాపురం వైసీపీ అభ్యర్థిగా చిరు మీద ప్రయోగం. ఈ రెండు కాకపోతే సొంత స్టూడియోలకు స్థలం కేటాయించడంపై వినతి. అందుకోసం ఐతే జగన్ ఆహ్వానం ప్రత్యేకంగా ఉండదు. పైగా స్పెషల్ ఫ్లైట్ వాడరు. ఇక్కడ స్పెషల్ ఫ్లైట్, మంత్రి పేర్ని నాని తాజా మాటలు ఒక చోట పెడితే పక్కాగా వాళ్లిద్దరి మధ్య రాజకీయ సంప్రదింపులు జరిగి ఉంటాయని మామూలు వాళ్ళు కూడా అనుమానిస్తారు. ఈ మధ్య వైసీపీ రెబెల్ త్రిబుల్ ఆర్ ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది. ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం విపక్ష మద్దతు తో గ్రౌండ్ తయారు అయింది.

ప్రత్యేకంగా నరసాపురం లోక్ సభ పరిధిలో 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసిన నాగబాబుకు 2.30లక్షల పైగా ఓట్లు వచ్చాయి. అక్కడ కాపు ఓట్లు బలంగా ఉన్నాయి. వాళ్ళ మద్దతు లేకుండా గెలవటం కష్టం. అందుకే జగన్ ముందుగా ఆపరేషన్ చిరు వ్యవహారాన్ని నడుపుతున్నాడని టాక్. ఇంకో మీటింగ్ వాళ్లిద్దరి మధ్య జరగబోతుంది. ఆ లోపు చిరు కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయం కు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు సంబంధించిన స్విచ్ ఇప్పటికే తెలంగాణలో ప్రతేకించి హైద్రాబాద్ లో వేశారని తెలుస్తుంది. అందుకే స్పెషల్ ఫ్లైట్ హైద్రాబాద్ టూ గన్నవరం కు తిరుగుతుంది. ఇంకోసారి స్పెషల్ ఫ్లైట్ ఎగిరితే చిరు ఆపరేషన్ ముగుస్తుందని వైసీపీ వర్గాల్లో వినికిడి. ఆ కోణం నుంచి మంత్రి కూడా మాట్లాడం ఇప్పుడు చిరు, జగన్ మధ్య భేటీ మళ్ళీ హాట్ టాపిక్ అయింది. సో..చిరు, నాని చెప్పిన మాటల్లో నిజం ఏదీ అనేది తెలియాలి అంటే ..కొన్ని రోజులు ఆగాలి. అప్పటి వరకు ఇలాంటి రాజకీయ లీకులు ఆధారంగా మనం చిరు ఆపరేషపై పలు కథనాలు వండాల్సిందే. ప్రజారాజ్యం విలీనం సమయంలో కూడా ఇలాగే జరిగిందనే విషయం మనకు తెలుసు. సో..ఎప్పుడు ఏదయినా జరగడానికి అవకాశం ఉందని పేర్ని తాజా వ్యాఖ్యలతో చిరు ఆపరేషన్ @తాడేపల్లి ప్యాలెస్ బై స్పెషల్ ఫ్లైట్ తెరమీద కనిపిస్తుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో..చూద్దాం!