Traffic Police : చంద్ర‌బాబు భ‌ద్ర‌త ఎంత‌? సెక్యూరిటీ ఆడిట్‌!

సెక్యూరిటీ ఆడిట్(security audit) చేయ‌డం స‌హ‌జం.

  • Written By:
  • Publish Date - December 14, 2022 / 01:47 PM IST

సెక్యూరిటీ ఆడిట్(security audit) చేయ‌డం స‌హ‌జం. ఎప్పుడు? ఎలా? ఎందుకు? అనేది పోలీస్ తెలియ‌చేయాలి. జ‌డ్ ప్లస్ కేట‌గిరీలో ఉన్న చంద్ర‌బాబునాయుడు సెక్యూరిటీపై ఆడిట్ (security audit)జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆయ‌న సెక్యూరిటీ ఇవ్వ‌డంలో జగ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింది. ట్రాఫిక్ క్లియెరెన్స్(Traffic), కాన్వాయ్ వెహిక‌ల్ త‌దిత‌రాలు ఆయ‌న‌కు ఉండాలి. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత చంద్ర‌బాబునాయుడుకు కొన్ని సంద‌ర్భాల్లో పోలీస్‌ కాన్వాయ్ ను ఏర్పాటు చేయ‌కుండా నిర్ల‌క్ష్యం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా కేంద్రం జోక్యం చేసుకుని జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఇస్తూ కమాండోల సంఖ్య‌ను పెంచింది. మూడంచెల భ‌ద్ర‌త‌ను ఆయ‌న‌కు ఇవ్వాల‌ని కేంద్ర హోంశాఖ ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకుంది. ఇదంతా ఈ ఏడాది తొలి రోజుల్లో జ‌రిగిన‌ చంద్ర‌బాబు సెక్యూరిటీ(Security) క‌థ‌. ఇప్పుడు సెక్యూరిటీ ఆడిట్(Security audit) ఏపీ, తెలంగాణ పోలీస్ సంయుక్తంగా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ట్రాఫిక్ క్లియెరెన్స్ కోసం

హైద‌రాబాద్ లో ట్రాఫిక్ క్లియెరెన్స్ (Traffic)కోసం చంద్ర‌బాబునాయుడు సెక్యూరిటీని ఆడిట్ చేయ‌డం ఏమిటి? అనుకుంటున్నారా? అదే మ‌రి ఏపీ, తెలంగాణ పోలీస్ సంయుక్త ఆప‌రేష‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఉంటోన్న హైద‌రాబాద్ ఇంటికి ఉన్న రోడ్ల మీద అనుమ‌తిలేని వాహ‌నాలు(Vehicals) తిర‌గ‌డానికి లేదు. మూడు వైపులా రోడ్ల మీద వాహ‌నాలు తిర‌గ‌కుండా ఉండేది. ట్రాఫిక్‌(Traffic)ను క్రమబద్ధీకరించ‌డానికి చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు దారులను తెరిస్తే రద్దీని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం బంజారాహిల్స్-జూబ్లీహిల్స్ కారిడార్‌లోనూ ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఎస్పీ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ రవీందర్‌రెడ్డితోపాటు పలువురు ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు చంద్రబాబు ముఖ్య భద్రతాధికారి మధుసూదన్‌తో మాట్లాడారు.

రోడ్డు నెంబరు 1 నుంచి రోడ్డు నెంబరు 65తో పాటు రోడ్డు నెంబరు 36లో హెరిటేజ్ పక్క నుంచి, రోడ్డు నంబరు 45 మీదుగా హెచ్‌పీ గ్యాస్ పక్క నుంచి చంద్రబాబు నివాసానికి చేరుకోవచ్చు. కాబ‌ట్టి రోడ్డు నంబరు 45 నుంచి వచ్చే వాహనాలను గ్యాస్ ఏజెన్సీ పక్కనున్న సందులోంచి రోడ్డు నంబరు 1కి మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద మూసేసిన పూర్తిగా మూసేసిన దారిలో సగం తెరిచి రాకపోకలకు అనుమతించాలని అధికారులు యోచిస్తున్నారు. వాళ్లు అనుకున్న మాదిరిగా ట్రాఫిక్ స‌డ‌లింపు జ‌రిగితే, చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద వాహ‌నాల(Vehicals) హోరు త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న సెక్యూరిటీ ఎంత వ‌ర‌కు భ‌ద్ర‌మో పోలీసులు తేల్చాలి.

చంద్ర‌బాబు సెక్యూరిటీ మీద

గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు సెక్యూరిటీ మీద అప‌వాదు వ‌చ్చింది. ఆయ‌న ఏపీ సీఎంగా ఉండ‌గా ఫోన్ల‌ను ట్రాప్ చేసిన ఘ‌ట‌న వెలుగుచూసింది. తెలంగాణ పోలీసులు చంద్ర‌బాబు ఫోన్ల‌ను ట్రాప్ చేసిన‌ట్టు ఆనాడు ఏపీ పోలీస్ కేసు న‌మోదు చేసింది. ఉమ్మ‌డి ఏపీ సీఎంగా దిగిపోయిన త‌రువాత కొన్నేళ్ల‌కు ఆయ‌న సెక్యూరిటీ గార్డ్(Security) ల స‌మీపంలో కొంద‌రు అర్థ‌రాత్రి దాటిని త‌రువాత రెక్కీ నిర్వ‌హించార‌ని అప్ప‌ట్లో న్యూస్ వ‌చ్చింది. ఆనాడు సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఆయ‌న‌కు భ‌ద్ర‌త ఇవ్వ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌ని స‌ర్వ‌త్రా వినిపించింది. ఆ క్ర‌మంలో కేంద్ర హోంశాఖ స్పందిస్తూ ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ లోని ఆయ‌న ఇంటి చుట్టూ ఉన్న రోడ్ల మీద‌కు ప్రైవేటు వాహ‌నాల‌(Vehicals)ను అనుమ‌తిస్తే భ‌ద్ర‌త ప‌దిల‌మా? అనేది టీడీపీ వ‌ర్గాల్లోని ఆందోళ‌న‌.

Also Read : Polavaram : జ‌గ‌న్ కు ఢిల్లీ షాక్‌! పార్ల‌మెంట్ లో ఏపీ స‌ర్కార్ భాగోతం!