Cyclone Mychaung : మైచౌంగ్ తుఫాను.. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై కనిపించేలా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ సైక్లోన్ వల్ల ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇక తదుపరిగా మైచౌంగ్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలపైనా పడే ఛాన్స్ ఉంది.అందుకే దీన్ని భారత వాతావరణ విభాగం (IMD) ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తోంది. తుఫాను ఎఫెక్టుతో ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. ఈరోజు ఏపీలోని తూర్పు, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వాన పడే అవకాశం ఉంది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
- బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, బాపట్ల, మచిలీపట్నం తీర ప్రాంతాల వైపుగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
- డిసెంబర్ 3(ఆదివారం) నాటికి మైచౌంగ్ తుఫాను మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
- డిసెంబర్ 4(సోమవారం) నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను మైచౌంగ్ తుఫాను తాకుతుందని ఐఎండీ చెబుతోంది.
- డిసెంబర్ 5న(మంగళవారం) ఇది నెల్లూరు – మచిలీపట్నం దగ్గర తీరం దాటే సూచనలు ఉన్నాయని ఐఎండీ అంటోంది.
- మైచౌంగ్ తుఫాను తీరం దాటే టైంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని సుడి 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని ఐఎండీ(Cyclone Mychaung) పేర్కొంటోంది.