Title: దేవినేని ఉమాకు ఏమైంది? ఎక్కడున్నాడు..?

ఆ సీనియర్ నేతకి...ఆ అధినేత ఎందుకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్లో కేబినెట్ సీటే ఇచ్చినా ఆ పెద్దాయన....ఈసారి అసెంబ్లీ సీటివ్వడానికి ఎందుకు మొహమాటపడ్డారు. నిజంగా ఆయన కోవర్ట్ అని తేల్చేసారా? లేకా ఛాన్స్ లేదని కాంప్రమైజ్ చేసారా? కాంప్రమైజ్ చేసినంత మాత్రాన...పార్టీలో ఉంటారా..? అసలు సీటు ఇవ్వలేదని ఇంత సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటి? ఇంతకీ ఆయనెవరు..? లెట్స్ రీడ్ దిస్ స్టోరీ..?

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 02:07 PM IST

Devineni Uma: ఆ సీనియర్ నేతకి…ఆ అధినేత ఎందుకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్లో కేబినెట్ సీటే ఇచ్చినా ఆ పెద్దాయన….ఈసారి అసెంబ్లీ సీటివ్వడానికి ఎందుకు మొహమాటపడ్డారు. నిజంగా ఆయన కోవర్ట్ అని తేల్చేసారా? లేకా ఛాన్స్ లేదని కాంప్రమైజ్ చేసారా? కాంప్రమైజ్ చేసినంత మాత్రాన…పార్టీలో ఉంటారా..? అసలు సీటు ఇవ్వలేదని ఇంత సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటి? ఇంతకీ ఆయనెవరు..? లెట్స్ రీడ్ దిస్ స్టోరీ..?

దేవినేని ప్రస్థానం:

దేవినేని ఉమా…. టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత. అలాంటి దేవినేనికి ఈసారి ఎలక్షన్స్‌కి సీటివ్వలేదు. టికెట్ ఇవ్వమని డైరెక్ట్‌గా కూడా చెప్పలేదు. ఇన్ని రోజులు టికెట్ ఇస్తారని చాలా ఈగర్‌గా వెయిట్ చేసారు. సరే…ఇప్పుడు టికెట్ లేదు… గెలిచాక ఏదో ఒకటి ఇస్తామనే హామీ కూడా ఇవ్వలేదట. దీంతో ఒకింత ఆలోచనలో పడ్డారు దేవినేని ఉమా. నిజంగా ఆయన్ను ఎందుకు పక్కన పెట్టారనే ఆలోచనలో పడ్డారట. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచిన దేవినేని ఉమా…..2019లో వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచీ ఎందుకో దేవినేని కాస్తంత వెనకబడ్డారు.

టీడీపీ పక్కన పెట్టిందా?:

నిజంగా పార్టీ కోసం అంత చేసిన దేవినేనిని ఎందుకు టీడీపీ పక్కన పెట్టింది అనే ప్రశ్న ఇప్పుడు..తెలుగు తమ్ముళ్లలో బాగా వినిపిస్తోంది. టికెట్ ఎందుకు ఇవ్వలేదు అన్న దాని కంటే….ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న కూడా వస్తోందట. వాస్తవానికి 2019లో టీడీపీ అధికారం కోల్పోవడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒక్కసారే జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన పార్టీలో ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా మిగిలిపోయారు. ఏదో అప్పుడప్పుడూ వైసీపీకి కౌంటర్లు ఇవ్వడం తప్పించి…గట్టిగా ఇంపాక్ట్ పడేలా ఏదీ చేయలేదు. కానీ ఎవరేమనుకున్నా…అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అధినేత చంద్రబాబుకు మాత్రం చాలా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత అధికారం కోల్పోయాక కూడా…ఆయన చాలా విషయాల్లో బాబు దగ్గరే ఉండి అన్నీ తానై చూసుకున్నారు.

ప్రస్తుతం టీడీపీ గడప దాటలేని స్థితిలో దేవినేని ఉమా ఉన్నారు. పార్టీతో పాటు నాయకత్వానికి అత్యంత విధేయుడు కూడా. ఎట్టి పరిస్థితుల్లో టిడిపికి దూరం కారు. ఆయనకు ఆప్షన్ కూడా లేదు. అయితే దేవినేని ఉమా లాంటి నేతను చంద్రబాబు పక్కన పెట్టారంటే అందుకు సరైన రీజన్ ఉంటుందని తెలుస్తోంది. ఆయనకు ముందస్తుగా సమాచారం ఇచ్చి.. ప్రత్యామ్నాయం చూపి.. అటు మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు, ఇటు పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. కానీ తాజాగా మూడో జాబితాలో తన పేరు లేకపోవడాన్ని మాత్రం దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే…టీడీపీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. మైలవరంలో కూడా అసలు కనిపించట్లేదు. అసలు దేవినేని ఉమా ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఎక్కడ ఉన్నారు:

గత ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి… టీడీపీ అభ్యర్థిగా ఉమా పోటీ చేశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఐదేళ్లుగా ఆ ఇద్దరు నేతల మధ్య వార్నింగులు నడుస్తున్నాయి. డైలాగులు వార్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఆమోదించడం వెనుక.. ఉమా నుంచి అభిప్రాయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తానని ఉమా హామీ ఇచ్చి ఉంటారని సమాచారం. చంద్రబాబుకు విధేయత కలిగిన నాయకుల్లో ఉమా ఒకరు. ఆయనకు చెందిన నియోజకవర్గంలో వేరొకరికి టికెట్ ఇస్తున్నారంటే తప్పకుండా ఆయన అభిప్రాయాన్ని తీసుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత ఆదేశాలను పాటించి.. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కు దేవినేని ఉమా సహకరిస్తున్నారు.