Sawang: ‘సవాంగ్’ వెనుక జరిగిందిదే.!

చీఫ్ సెక్రటరీ, డీజీపీ లను మార్చటం రాష్ట్ర ప్రభుత్వాలకు తేలికైన పని కాదు. ఒక ప్రోటోకాల్ పాటించాలి. కేంద్రం అనుమతి లేకుండా పక్కన పెట్టడానికి లేదు. ఆ రెండు పదవుల ను నింపాలి అంటే ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి. సినియార్టీ ప్రకారం కేంద్రానికి లిస్ట్ పంపాలి. డిప్యుటేషన్ విషయంలో కూడా అంతే.

  • Written By:
  • Updated On - February 16, 2022 / 03:07 PM IST

చీఫ్ సెక్రటరీ, డీజీపీ లను మార్చటం రాష్ట్ర ప్రభుత్వాలకు తేలికైన పని కాదు. ఒక ప్రోటోకాల్ పాటించాలి. కేంద్రం అనుమతి లేకుండా పక్కన పెట్టడానికి లేదు. ఆ రెండు పదవుల ను నింపాలి అంటే ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి. సినియార్టీ ప్రకారం కేంద్రానికి లిస్ట్ పంపాలి. డిప్యుటేషన్ విషయంలో కూడా అంతే. గతంలో తెలంగాణ నుంచి ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి జగన్ విఫలం అయ్యాడు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ను మార్చేటప్పుడు కూడా చాలా తతంగం జరిగింది. ఇప్పుడు డీజీపీ సవాంగ్ మారటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని హైకోర్టు పలుమార్లు చురకలు వేసింది. అమరావతి ఉద్యమం సమయంలోనూ పోలీస్ వైఫల్యం చెందింది. చంద్రబాబు ఎత్తుగడలను పసికట్టటంలోనూ సరైన రీతిన వ్యవహరించలేదు. కరోన సమయంలో మానవీయ కోణంలో ఏపీ పోలీస్ పని చేయలేదు. కోర్టు బోనులో నిల్చోని ఉండేలా సవాంగ్ వాలకం ఉంది. ఆయన మీద చంద్రబాబు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. టీడీపీ ఆఫీసు లను పగుల కొట్టినప్పుడు కూడా ముందుగా తెలుసుకో లేకపోయాడు. గుడివాడ కాసినో కు పూర్వం చాలా వైఫల్యాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగుల సమ్మె, చలో విజయవాడ సవాగ్ పని తీరును ప్రశ్నించింది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకం అవుతోంది. సవాంగ్ బదిలీపై వివాదాలుఅనుమానాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి.జనసేన కూడా తనదైన వాదన ఒకటి వినిపిస్తోంది.

ఇటీవల పీఆర్సీ సాధన సమితి నేతృత్వాన జరిగిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం ఆ విషయమై ఇంటెలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చిన రీతిన కనిపించడంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేనాని పవన్ ఆరోపిస్తున్నారు. కొత్త డీజీపీ రాక నేపథ్యంలో మరో వివాదం కూడా రేగుతోంది. కసిరెడ్డి వెంకట రాజేంద్ర నాథ్ రెడ్డి కి శుభాకాంక్షలు చెబుతూ రెడ్డి సామాజిక వర్గ పెద్దలంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. గతంలో ఇదే విధంగా ఎందరెందరో పరిపాలన సంబంధ నిర్ణయాల్లో భాగంగానే బదిలీ అయి ఉంటారు.కానీ ఇక్కడ రాజకీయ కారణంగానే ఆయన బదిలీ అయ్యారని జనసేన తరఫున పవన్ ఆరోపిస్తుంటే మరోవైపు కొందరు రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులు డీజీపీ మావాడే అంటూ హడావుడి చేస్తున్నారు.

ఏ విధంగా చూసుకున్నా ఇటువంటి పరిణామాలు హర్షించదగ్గవి కావు అని కూడా జనసేన అంటోంది.ఇటుంటి పోస్టర్లను అప్ చేయడం ద్వారా వైసీపీ తన గౌరవాన్ని కోల్పోతుందని తన పరువు తానే తీసుకుంటుందని అభిప్రాయపడుతోంది.ఓ అధికారి అంటే కులంమతం అన్న అంటింపు లేకుండా పట్టింపు లేకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల వారినీ కులాల వారినీ సమానంగా చూడాలి. కొత్త డీజీపీ రాక నేపథ్యంలో కుల వివాదాలు రేపుతున్నారు.గతంలో కూడా పోలీసు శాఖలో పదోన్నతుల విషయమై కమ్మ సామాజికవర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చంద్రబాబుపై వైసీపీ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వైసీపీ తన పంథా మార్చి ఈ విధంగా నడుచుకోవడం తగదని కూడా చెబుతున్నారు జనసేన అభిమానులు. ఒకటి మాత్రం వాస్తవం..ఇప్పటికిప్పుడు జరిగిన బదిలీ కాదు. ఇటీవల కేంద్రం పెద్దలను కలిసినప్పుడే ఈ బదిలీల అంశం జగన్ చర్చించి ఉంటాడు. కేంద్రం అనుమతి లేకుండా కొత్త డీజీపీ ని నియమించారు. సో..దీని వెనుక ఏపీ టూ ఢిల్లీ రాజకీయం ఉంది. నో డౌట్.!