Site icon HashtagU Telugu

YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్‌ మరో ట్వీట్‌

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Tirumala Laddu Controversy : ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తర్వాత వైసీపీ, టీడీపీ అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ముందు లడ్డూ వివాదంతో మొదలైన ఈ మాటల యుద్ధం అనంతరం డిక్లరేషన్ కు చేరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది. దీనిపై జగన్ స్పందిస్తూ.. దీనర్థం ఏమిటి చంద్రబాబు? అని ప్రశ్నించారు. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.

Read Also: Sound Pollution : హైదరాబాద్‌లోని 17 పబ్‌లపై కేసు..

అంతకాక.. ఈ ట్వీట్ ను జగన్ కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జీతన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్, శర్బానంద్ సోనోవాల్, ప్రహ్లాద్ జోషీ, జ్యూయల్ ఓరం, మన్సుఖ్ మాండవీయ, గిరిరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరీ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇందర్ జీత్ సింగ్, జితేంద్ర సింగ్ లకూ ట్యాగ్ చేయడం విశేషం.

కాగా, ఒక వీడియోలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్లు వెల్లడైందని వివరించారు. దీంతో ఆ నెయ్యి సరఫరాదారును బ్లాక్ లిస్ట్‌లో ఉంచామని తెలిపారు. ఈ క్రమంలో రెండు ట్యాంకర్ల నెయ్యిని తిప్పి పంపామని వెల్లడించారు. అయితే ఈవో జె.శ్యామలరావు ఈ వ్యాఖ్యలు చేసింది జులై 23వ తేదీగా చెప్పారు.

Read Also: CM Revanth Reddy : పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు