Nara Lokesh: వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? జగన్ పై లోకేశ్ ఫైర్

  • Written By:
  • Updated On - February 12, 2024 / 11:44 PM IST

Nara Lokesh: శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 25 మందికి 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని విమర్శించారు. జగన్ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారు, వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారు, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్, ఒకరి ఇంట్లో చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు, ఆరోజే జగన్ ఓటమి ఒప్పుకున్నారు. బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు, ఇది జగనాసుర రక్తచరిత్ర. జగన్ సొంత తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపారు. రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు, చార్జిషీటులో వారి ఎంపి అవినాష్ రెడ్డి పేరు ఉంది, రేపోమాపో జగన్ పేరు కూడా ఆ లిస్టులో చేరుకుంది. జగన్ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్ పై రూ.25 జే-ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్ జేబులోకి వెళుతోంది. మద్యం ద్వారా ఏడాది 9వేలకోట్లు చొప్పున అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేశాడు.

జగన్ రెడ్డిని చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఆయన బ్లూ బటన్ నొక్కి రూ.10 ఎకౌంట్లలో వేస్తే .. రెడ్ బటన్ నొక్కి వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశమిస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్ రెడ్డి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు. అన్న క్యాంటీన్లు, డ్రిప్ ఇరిగేషన్, చంద్రన్న బీమా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రెడ్డి రద్దు చేశారు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు కిలో రూ.2కే బియ్యం ఇచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. వాలంటీర్లతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కార్యకర్తలంతా గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారికంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పాలి. నేను 3,132 కి.మీ పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నాను. ఎటువంటి అనుమానం లేదు… వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నారా లోకేశ్ అన్నారు.