Site icon HashtagU Telugu

AP Exit Polls : చంద్రబాబు, పవన్, జగన్‌లపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఇదే

Ap Exit Polls

Ap Exit Polls

Dinesh Akula

AP Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపైనే ఇప్పుడు అంతటా  చర్చ జరుగుతోంది.  ఒకవేళ అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మళ్లీ ఏపీలో కీలకంగా మారుతారు. ఆయన పార్టీ తెలుగుదేశం పునరుత్తేజాన్ని సంతరించుకుంటుంది. మెగా స్టార్ కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ ‌కు ఏపీలో ముఖ్యపాత్ర పోషించే ఛాన్స్  దక్కుతుంది. తదుపరిగా 2029 ఎన్నికల నాటికి ఏపీలో మరింత బలోపేతం అయ్యేందుకు బీజేపీ ఫ్యూచర్ ప్లాన్‌ను రెడీ చేసుకునేందుకు తలుపులు తెరుచుకుంటాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే జరిగితే.. వైఎస్సార్ సీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఆ పార్టీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి చాలా టైం పడుతుంది. విమర్శలు, ఆరోపణల నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బయటపడటం కష్టతరంగా మారుతుంది.

We’re now on WhatsApp. Click to Join

జూన్ 1న వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) ఫలితాలను విడుదల చేశాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో ఎన్డీయే గాలి వీస్తుందని జోస్యం చెప్పాయి. వైఎస్సార్ సీపీ దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తుందని తెలిపాయి. ఒకవేళ అదే జరిగితే.. చంద్రబాబు నాయుడికి ఇదొక కొత్త ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ ఈసారి తాను గెలవకుంటే.. ఇవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పారు. ఇటువంటి గడ్డు పరిస్థితిని ఎదురీది చంద్రబాబు గట్టెక్కితే.. అది చాలా గొప్ప విషయమే అవుతుంది.

Also Read :600 Trash Balloons : ఉత్తర కొరియా ‘చెత్త’ వేధింపులు.. దక్షిణ కొరియా బార్డర్‌లో కలకలం

‘‘తిరిగి అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా’’ అని ప్రతిన బూని 2021 సంవత్సరంలో  చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తన భార్యపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆనాడు చంద్రబాబు ఆ కామెంట్ చేశారు. అప్పట్లో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ వాళ్లు తన భార్య పరువు తీశారని కంటతడి పెట్టారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్ సీపీలోకి వెళ్లిపోయారు. దీంతో టీడీపీకి గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వాటిని చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయినా టీడీపీ అంటే అభివృద్ధికి బ్రాండ్ అని చెబుతూ జనంతో ఆయన మమేకం అయ్యారు. రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారంటూ ఆయన పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీని ఫలితం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందనే ఆశాభావంతో చంద్రబాబు ఉన్నారు.

Also Read : 70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ

ఏపీలో అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం చంద్రబాబు నాయుడుకు పెద్ద సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీపై రూ.13.50 లక్షల కోట్ల భారీ రుణభారం ఉంది. పరోక్షంగా ఏపీలోని ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షలు, ఒక్కో వ్యక్తిపై రూ.2 లక్షల అప్పుల భారం ఉంది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణకు నానా తంటాలు పడుతోంది. బీజేపీ -టీడీపీ -జనసేన కూటమి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తామని మాట  ఇచ్చింది. రైతులకు సంవత్సరానికి రూ. 20,000 పెట్టుబడి మద్దతును అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లకు రాయితీలను అందిస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు పెద్ద పరీక్షా కాలమే ఎదురవుతుంది.దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు కూడా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన  హామీని కూటమి నెరవేర్చాల్సి ఉంటుంది. నేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది.

Also Read : Harish Rao: కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్!

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. అందుకే ఆయన చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 22 రోజుల పాటు బస్సుయాత్ర చేశారు. దీనివల్ల ప్రజల నుంచి వైఎస్సార్ సీపీకి కొంత మద్దతు వచ్చింది.  అయినప్పటికీ ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాలలో ఎన్డీయే కూటమి నుంచి వైఎస్సార్ సీపీకి బలమైన పోటీ ఎదురుకానుంది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో జగన్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 2019లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసిన రాయలసీమలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న అత్యధిక నియోజకవర్గాలపై ఈసారి కూడా ఆ పార్టీ పైచేయి కొనసాగుతుందని అంటున్నారు.

Also Read : Preminchoddu: ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ రిలీజ్

ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓడిపోతే జగన్‌కు కొన్ని సమస్యలు మొదలయ్యే ముప్పు ఉంది. ఇప్పటివరకు ఆయన కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీ పెద్దలతో సఖ్యతతో వ్యవహరించారు.  ఓడిపోతే ఆ ఛాన్స్ ఉండదు. ఫలితంగా గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల జగన్‌పై ఉన్న పాత కేసులను తిరగదోడే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని బీజేపీని చంద్రబాబు కోరే అవకాశం లేకపోలేదు.  గత ఐదేళ్ల పాలనలో తనకు ఎదురైన ఇబ్బందులకు ప్రతీకారం తీర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ చంద్రబాబు అలా చేయడానికి ఇష్టపడకపోయినా.. ఆయన అనుయాయుల నుంచి జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే  డిమాండ్ వినిపించే అవకాశం ఉంది.ఇదే పరిస్థితి తలెత్తితే.. వైఎస్సార్ సీపీ నుంచి చాలామంది కాంగ్రెస్, టీడీపీలోకి వలస వెళ్లే అవకాశం ఉంటుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా  ఉన్న షర్మిల ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంది.

Also Read : Happiness : సంతోషానికి మూలం నీలోనే ఉంది

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఈ ఎన్నికల ఫలితాలే ఆయన భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించారు. కానీ తగిన క్యాడర్ లేకపోవడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఐదేళ్ల తర్వాత 137 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయగా.. ఒకే చోట  గెలిచింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ పార్టీకి కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి గెలిస్తే.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర దక్కే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి కేంద్రమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అంతటి స్థాయికి చేరే దాఖలాలు ఉన్నాయి. ఏపీలో డిప్యూటీ సీఎం పోస్టు రేసులో పవన్ కల్యాణ్ ఉన్నారని అంటున్నారు. ఈ అంశాలపై జనసేనాని మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.