Site icon HashtagU Telugu

Central Schemes: సెంట్రల్స్ స్కీమ్స్ డైవర్ట్.. ఆ పథకాల పరిస్థితేమిటో!

Central Schemes

Central Schemes

రోజువారీ ప‌రిపాల‌న వ్యవ‌హారాలకే ఫండ్స్ లేక ఇబ్బందులు ప‌డుతున్న ఏపీ ప్రభుత్వం సెంట్రల్ స్కీమ్స్ అమ‌లును ఎంత‌వ‌ర‌కు చేయాల‌న్నదానిపై మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. జ‌న‌ర‌ల్‌గా ఏ ప‌థ‌కానికైనా కేంద్రం, రాష్ట్రాలు నిధులు ఇస్తాయి. దాదాపుగా ఇవి జాయింట్ స్కీములు లాంటివి. బెనిఫిసియ‌ర్స్ ఎంపిక‌, త‌దిత‌ర విష‌యాల‌ను ఇంప్లిమెంట్ చేయ‌డం స్టేట్ చేతిలో ఉంటాయి. కేంద్రం ఇచ్చే గ్రాంటుకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తుంది. సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ దాదాపుగా 130 ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంది. త‌న వాటా కింద రూ.20 వేల కోట్లు ఇస్తోంది. రాష్ట్రం త‌న వాటా కింద దాదాపు రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటోంది.

ఏపీ ప్రభుత్వం త‌న వాటా కింద ఫండ్స్ ఇచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డం వ‌ల్ల కొన్ని ప‌థ‌కాల‌ను వ‌దిలించుకోవాల‌న్న ఆలోచ‌న చేస్తున్నట్టు స‌మాచారం. రాష్ట్రం తాను ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వక‌పోగా,  కేంద్రం ఇస్తున్న నిధుల‌ను ఇత‌ర ఖ‌ర్చుల కోసం డైవ‌ర్ట్ చేస్తున్నట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్‌కు ఫిర్యాదులు అందాయి కూడా. దాంతో మ్యాచింగ్  గ్రాంటు ఇచ్చిన త‌రువాతే, తాము ఇచ్చిన గ్రాంటును ఉప‌యోగించుకోవాల‌ని, లేదంటే ఫండ్ ను  తీసుకోవ‌డానికి వీల్లేద‌ని కేంద్రం కండిష‌న్ పెట్టింది. చివ‌ర‌కు నిధులు లేక కొన్ని ప‌థ‌కాల‌ను వ‌దిలించుకోవాల‌ని రాష్ట్రం భావిస్తోంది. కేంద్ర నిధుల కోసం గ‌తంలో ఆయా శాఖ‌ల మంత్రులే ప్రపోజ‌ల్స్ పంపించేవారు. ఇప్పుడు తొలుత ఆర్థిక శాఖ‌, ఫైన‌ల్‌గా త‌న ప‌ర్మిష‌న్ లేకుండా ఎలాంటి ప్రయ‌త్నం చేయ‌కూడ‌ద‌ని సీఎం ఆదేశించారు. చివ‌ర‌కు ఎన్ని కేంద్ర ప‌థ‌కాలు అమ‌ల‌వుతాయ‌న్నది చూడాల్సిందే.