Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా జనసేన అధినేత పవణ్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున వంగా గీత బరిలోకి దిగుతున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఇప్పటిదాకా ఎన్నికల్లో చెప్పుకునేంత రేంజులో ఫలితాలను సాధించలేదు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆ పార్టీకి టీడీపీ, బీజేపీలు టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి.  ఈనేపథ్యంలో కనీసం ఈసారైనా ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుస్తారా ? గెలవారా ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

జగన్ ప్లాన్ ఇదీ.. 

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత విషయానికి వస్తే.. ఆమె 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు. దీంతో ఆమె ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఈ అసెంబ్లీ స్థానంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 91 వేలు ఉన్నాయి. అదే వర్గానికి చెందిన  వంగా గీత, పవన్ కల్యాణ్‌లు పోటీ చేస్తుండటంతో ఈసారి ఎన్నిక రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ.. ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమవైపే ఉంటుందనే నమ్మకంతో ఉంది. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చు అని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని అంటున్నారు. ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఎంపీగా ఉన్న వంగా గీతను ఇక్కడి నుంచి జగన్ పోటీచేయిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

పవన్(Pawan Kalyan) రాకతో సీన్ మారిపోయిందని జన సైనికులు చెబుతున్నారు. సర్వే నివేదికలన్నీ పవన్‌కు అనుకూలంగానే ఉన్నాయని వారు వాదిస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ను ఈసారి పిఠాపురం నుంచి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని కాపులు ఫిక్స్ అయ్యారట. రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనని చెబుతున్నారు. డైలాగులు వేరు.. ఫీల్డ్‌లో ఓటర్లను ఆకట్టుకోవడం వేరు అనే అభిప్రాయం కూడా మరికొందరు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో పవన్ ఎలాంటి వ్యూహంతో  పిఠాపురంలో ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్ 04 వరకు మనం వెయిట్ చేయాల్సిందే.

Also Read : Kavitha Vs ED : కేజ్రీవాల్, సిసోడియాతో కవిత డీల్.. ఈడీ సంచలన రిపోర్టు