Andhrapradesh : టెక్నాలజీకే చుక్కలు చూపిస్తున్న గజ దొంగ

వందల కొద్దీ సీసీ కెమెరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసుల వద్ద అధునాతమైన పరికరాలు ఉన్నాయి

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 12:50 PM IST

వందల కొద్దీ సీసీ కెమెరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసుల వద్ద అధునాతమైన పరికరాలు ఉన్నాయి. కానీ ఈ స్టోరీలో చెప్పే దొంగ మాత్రం ఖాకీలకు చుక్కలు చూపిస్తున్నాడు. టెక్నాలజీ కూడా ఏం చేయలేక పోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు పాత పద్దతిని వెలుగులోకి తీసుకువచ్చారు. ఇంతకీ ఆ పాత పద్దతి ఏంటి అనుకుంటున్నారా.. అదేనండి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుతి ఇస్తామని బహిరంగా ప్రకటనను వెలువరించారు..

చోరీలు చేయడంలో మాములు సిద్ధహస్తుడు కాదు

కాకినాడకు చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు చోరీలు చేయడంలో సిద్దహస్తుడు. చోరీ చేయాలని మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా చీకటి పడిన తర్వాత తాళం ఎప్పుడు పగలగొట్టాడో తెలియకుండా చోరీలు చేయడంలో ఎక్స్‌పర్ట్. ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చిన మారని ఈ శంకర్ ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులను ఓరేయ్ దొంగనాయాల ఎక్కడున్నావురా అని తలలు పట్టుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమవరం ప్రాంతంలో వరుస చోరీలు చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ గజ దొంగ ఎంచుకున్న ఇళ్లు చిన్న చితకవి కాదు. ఒక్కో ఇంట్లో మినిమం 50 కాసులు బంగారాన్ని తక్కువ కాకుండా చోరీ చేశాడు. వీడి దెబ్బకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నేరుగా రంగంలోకి దిగాడంటే వీడు మాములోడు కాదని పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం కోడైకూస్తోంది.

ఆధారాలు లభించినా ఏం చేయలేని పరిస్థితి

భీమవరం, వీరవాసరం, అకివీడీ , పాలకొడేరు, ఉండి గ్రామాలల్లో చోరీలకు పాల్పడ్డ వీరబాబును పట్టుకోవ డానికి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించినా అతడిని పట్టుకోలేక పోతున్నారు. ఇతగాడిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం అంటూ లేదు. చివరకు ఎప్పుడో పాత కాలం పద్దతిని వెలుగులోకి తీసుకువచ్చారు. అదేనండి ఈ దొంగవీరబాబును పట్టిస్తే తగిన పారితోషకం ఇవ్వబడును అని బహిరంగ ప్రకటన విడుదల చేశారు భీమవరం టూ టౌన్ పోలీసులు. పలు గ్రామాల్లో వాల్‌పోస్టర్లను అతికించారంటే ఆ దొంగను పట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్ధమవుతుంది.