Site icon HashtagU Telugu

Well Done Nara Lokesh : చంద్రబాబు తిన్న అన్నం ప్లేట్ని తీసి వెల్ డన్ అనిపించుకున్న లోకేష్

Naralokeshwell Done

Naralokeshwell Done

శనివారం బాపట్లలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌(Parent-Teacher Meeting)లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో పరిపూర్ణతను తీసుకురావడంలో తల్లిదండ్రుల పాత్రను వివరించడంలో నేతలు ప్రాధాన్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వారు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు.

భోజనానంతరం తన తండ్రి చంద్రబాబు ప్లేటును స్వయంగా తీయడం ద్వారా నారా లోకేశ్ వినయాన్ని చాటుకున్నారు. ఈ ఘటనను చూసిన ఆయన తల్లి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ప్రశంసించారు. ‘వెల్డన్ లోకేశ్. తల్లిదండ్రుల పట్ల నీకున్న గౌరవం, అణకువను ఇది ప్రతిబింబిస్తుంది. నీ చర్యలు స్ఫూర్తిదాయకం’ అంటూ ట్వీట్ చేశారు.

లోకేశ్ సాధారణత, సేవాభావం అనేకమందికి ఆదర్శంగా నిలిచాయి. సాధారణంగా రాజకీయ నేతలు తాము చేసిన పనులతో కాకుండా, వ్యక్తిగత ప్రవర్తనతో ప్రజల మనసులను గెలుచుకుంటారు. ఈ ఘటనలో లోకేశ్ చేసిన చర్యలు ప్రజలలో మంచి అభిప్రాయం కలిగించాయి. ఈ కార్యక్రమంలో విద్యా విధానంలో చేపట్టాల్సిన రిఫార్ములు, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి పై చర్చ జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల భవిష్యత్తు పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నేతలు వివరించారు.

Read Also : Discount Offer: ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 16 వేలు త‌గ్గింపు!