Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

Weird Politics in AP : క‌నిపించే శ‌త్రువుతో పోరాడ‌గ‌లం. కానీ, క‌నిపించ‌ని శ‌త్రువుతో పోరాడ‌లేం. ఈ నినాదం క‌రోనా స‌మ‌యంలో బాగా వినిపించేది.

  • Written By:
  • Updated On - September 26, 2023 / 02:32 PM IST

Weird Politics in AP : క‌నిపించే శ‌త్రువుతో పోరాడ‌గ‌లం. కానీ, క‌నిపించ‌ని శ‌త్రువుతో పోరాడ‌లేం. ఈ నినాదం క‌రోనా స‌మ‌యంలో బాగా వినిపించేది. ఇప్పుడు దాన్ని రాబోవు ఎన్నిక‌ల‌కు వ‌ర్తింప చేస్తే స‌రిపోతుంది. ఎందుకంటే, ఏపీలో డైరెక్ట్ గా పోటీలోకి దిగే పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ మాత్ర‌మే. క‌నిపించ‌కుండా పోటీలో ఉండేవి ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ. అవ‌స‌ర‌మైతే, బీఎస్పీ కూడా ఉంటుంద‌ని టాక్. ఇలాంటి ఈక్వేష‌న్ అస‌రుద్దీన్ ఓవైసీ వినిపించిన తాజా స్టేట్మెంట్ తో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల‌ను అస్త్రాలుగా..(Weird Politics in AP)

బ‌హిరంగంగా వైసీపీ మాత్ర‌మే ఒంట‌రిగా త‌ల‌ప‌డ‌బోతుంద‌ని అంద‌రూ భావించ‌డం స‌హ‌జం. కానీ, లోతుగా రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే, ఆ పార్టీకి అండ‌గా ఎన్ని పార్టీలు ఉన్నాయో బోధ‌ప‌డుతుంది. ఏపీలో కూడా పోటీ చేస్తామ‌ని అస‌రుద్దీన్ ఓవైసీ మంగ‌ళ‌వారం ప్ర‌కటించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ధ‌తు ఇస్తూ ఆయ‌న సందేశాలు మైనార్టీల‌కు పంపారు. వెనుక‌బ‌డిన‌వ‌ర్గాల్లోని ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం యాద‌వుల నుంచి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు ట్రైనింగ్ ఇచ్చిన కేసీఆర్ ఏపీకి పంపిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంటే, గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, ఎంఐఎం క‌నిపించ‌కుండా వైసీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చాయ‌న్న‌మాట‌. ఇక బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు తెర‌వెనుక చేసిన పోలింగ్ మేనేజ్మెంట్ గురించి ప్ర‌త్యేకంగా  (Weird Politics in AP)  చెప్ప‌న‌వ‌స‌రంలేదు.

గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, ఎంఐఎం  వైసీపీకి మ‌ద్ధ‌తు

రాబోవు ఎన్నిక‌ల్లో డైరెక్ట్ గా రంగంలోకి దిగ‌డానికి ఎంఐఎం సిద్ద‌మ‌యింది. ఏపీలోనూ పోటీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. సేమ్ టూ సేమ్ తెలంగాణ‌లో స‌హ‌జ మిత్రుడుగా ఉన్న కేసీఆర్ కు ఎలా స‌హ‌కారం అందిస్తున్నారో, ఆ త‌ర‌హాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా అందించ‌డానికి సై అంటున్నారు. అందుకే, చంద్ర‌బాబు జైలుల్లో ఉండ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబు న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తికాదు, ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ను న‌మ్మొద్దు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే, ఇప్ప‌టి నుంచే తెలుగుదేశంకు మైనార్టీల‌ను దూరం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అస్త్రాన్ని  (Weird Politics in AP)  సంధించార‌న్న‌మాట‌.

Also Read : Jagan Praja Ashirvada Yatra : ప్రజాశీర్వాద యాత్ర చేపట్టబోతున్న సీఎం జగన్..?

గ‌త ఎన్నిక‌ల్లో మైనార్టీలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా నిలిచారు. కానీ, ఈసారి సీన్ మారింద‌ని స‌ర్వేల సారాంశం. బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోన్న వైసీపీకి దూరంగా మైనార్టీలు జ‌రిగారు. ఆ వ‌ర్గాల్లోని త‌ట‌స్థులు సంపూర్ణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్య‌తిరేకిస్తున్నార‌ని తాజా స‌ర్వేల్లోని అంచ‌నా. అందుకే, ఎంఐఎం రూపంలో అస‌రుద్దీన్ ను ఏపీలోకి దించ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. మ‌రో వైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే పార్టీ ఆఫీస్ ను ప్రారంభించింది. ఆ పార్టీ ఏపీ చీఫ్ గా తోట చంద్ర‌శేఖ‌ర్ రావు ఉన్నారు. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న ద్వారా ఆ సామాజిక‌వ‌ర్గంలోని ఓట్ల‌ను చీల్చ‌డానికి సిద్దం అయ్యారు. ఎంపిక చేసిన సీట్ల‌లో బీఆర్ఎస్ పార్టీలోని రంగంలోకి దించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో అస్త్రాన్ని చేతిలో ప‌ట్టుకున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : Jagan Final Survey : సిట్టింగ్ లు 40 మందికి ఎస‌రు? `ముంద‌స్తు`కు జ‌గ‌న్ దూకుడు!!

ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం అభ్య‌ర్థులు ఈసారి ఏపీలో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అలాగే, కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు 2019 ఎన్నిక‌ల మాదిరిగా సంపూర్ణ ఎన్నిక‌ల మేనేజ్మెంట్ స‌హ‌కారం అందించ‌నున్నార‌ని వినికిడి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునే శ‌క్తి టీడీపికి ఉందా? అంటే వ‌చ్చే స‌మాధానం విభిన్నం. సామాజిక‌వ‌ర్గాల వారీగా ఓట్ల‌ను దండుకోవ‌డానికి ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేశారు. ఒక వేళ టీడీపీకి సాలిడ్ గా ఓటు బ్యాంకు ఉంద‌ని స‌ర్వేల్లో తేలితే, అక్క‌డ ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల‌ను అస్త్రాలుగా ఉప‌యోగించ‌బోతున్నార‌ని వినికిడి. ఇక అంతిమ అస్త్రంగా బీఎస్పీని అవ‌స‌ర‌మైతే వాడుకోవ‌డానికి సిద్దం చేశార‌ని కూడా వినిపిస్తోంది.