Weddings Season : ఈ ఏడాదికి సంబంధించిన పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోంది. జనవరి 31 నుంచి మే నెల 23వ తేదీ వరకు పెద్దసంఖ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఆయా తేదీల్లో పెద్దసంఖ్యలో ఇప్పటికే పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల కోసం ఎంతోమంది ఇప్పటికే ఫంక్షన్ హాళ్లను కూడా బుక్ చేసుకున్నారు. క్యాటరింగ్ సర్వీసుల వారికి ఆర్డర్లు ఇచ్చేశారు. మొత్తం మీద ఈ వివాహాల సీజన్ వేళ ఎంతోమంది ఉపాధిని కూడా పొందుతారు. పురోహితులు, క్యాటరింగ్ చేసేవారు, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, టెంట్‌హౌస్‌లకు గిరాకీ ఒక్కసారిగా పెరగనుంది. చేతినిండా పని దొరుకుతుంది.
Also Read :Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ
వివాహ శుభ ముహూర్తాలు ఇవీ..
- జనవరి : 31వ తేదీన శుభ ముహూర్తం ఉంది.
- ఫిబ్రవరి : 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 20, 22, 23 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
- మార్చి : 1, 2, 6, 7, 12, 14, 15, 16 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
- ఏప్రిల్ : 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
- మే : 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
Also Read :Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే
పెళ్లిళ్ల సీజన్ గురించి..
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది. దీనివల్ల మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉంటాయి. అయితే ఫాల్గుణ మాసంలో (మార్చి 18 నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి ఉంది. దీని కారణంగా ఆ వ్యవధిలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. శ్రీరామనవమి తర్వాత పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉంటాయి. ఉగాదిలోపు పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతాయి. పెళ్లిళ్లు అనేవి సమాజానికి పునాది లాంటివి. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సైతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. కనీసం ముగ్గురైనా పిల్లలు ఉండాలని చాలామంది బడా నేతలు చెబుతున్నారు. ఈ అంశాన్ని కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే వారు ఇప్పటికే అర్థం చేసుకొని ఉంటారు.