Lokesh : ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్‌

అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
We will introduce 'One Class One Teacher' policy: Minister Lokesh

We will introduce 'One Class One Teacher' policy: Minister Lokesh

Lokesh : ఏపీ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్‌ను బీజేపీ కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్‌ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read Also:Drinking Cold Water : వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా? అయితే వచ్చే సమస్యలు ఇవే !

హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. మాతృభాషను ప్రోత్సహించండి.. కాపాడాలని కేంద్రం తెలిపింది. అని లోకేశ్‌ చెప్పారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇక, వైసీపీ సభ్యుడి మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దీన్ని మంత్రి లోకేశ్ స్వాగతించారు.

పాఠశాలల్లో సదుపాయాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. వైసీపీ తీరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. సౌకర్యాలు లేక విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖలో సంస్కరణలు చేపట్టాం. టీచర్ల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్టును తీసుకొస్తున్నాం. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు మాత్రమే చెప్పాలన్నది మా విధానం. వారిపై యాప్‌ల భారాన్ని తగ్గించి అన్ని వివరాలతో ఒకే యాప్‌ తీసుకొస్తున్నాం. మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసి విద్యాప్రమాణాలు పెంచుతున్నాం. పాఠశాలల్లో రేటింగ్స్‌ విధానం అమలు చేస్తాం. ‘మన బడి- మన భవిష్యత్తు’ కింద మౌలిక వసతులు కల్పిస్తాం’’ అని లోకేశ్‌ వివరించారు. గత ప్రభుత్వంలో ఐబీ రిపోర్టు కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ అమలు చేశారో చెప్పాలి. అప్పట్లో టోఫెల్‌కు రూ.60 కోట్లు ఖర్చు పెట్టారని లోకేశ్‌ తెలిపారు.

Read Also: Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని

 

  Last Updated: 19 Mar 2025, 01:15 PM IST