ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగాన్ని (Education) విస్తృతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను (Foreign Universities) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యను అందించేందుకు నారా లోకేశ్ (Nara Lokesh) నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో బిట్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 70 ఎకరాల భూమిని కేటాయించనుంది.
Zodiac Signs: మార్చి 19న ఈ 5 రాశుల వారి జాతకం మారిపోనుందా.. ఇందులో మీ రాశి ఉందో లేదో చూడండి!
ప్రత్యేకంగా టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, IIT మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వంటి ప్రముఖ సంస్థలతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇది అత్యాధునిక సాంకేతికత, పరిశోధన రంగాల్లో విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందించనుంది. అంతేకాక, విశాఖపట్టణంలో AI విశ్వవిద్యాలయం, అమరావతిలో స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇవి విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పించి, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయి.
Sand Supply : ఇంటికే ఇసుక పంపిస్తున్న తెలంగాణ సర్కార్
ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించడంతోపాటు, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పురోగతి సాధించేందుకు వీలవుతుంది. విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఇదొక మంచి అవకాశం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.