Electricity sector : కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు

డిస్ట్రిబ్యూషన్‌, జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్‌ తీసుకొచ్చాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్‌ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.

Published By: HashtagU Telugu Desk
We have made AP the only state without electricity shortage: CM Chandrababu

We have made AP the only state without electricity shortage: CM Chandrababu

Electricity sector : ఏపీ శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..విద్యుత్‌ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. 1988లో విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్‌, జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్‌ తీసుకొచ్చాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్‌ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.

Read Also: Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు

రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం మేర పెరిగిందని సీఎం చెప్పారు. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని.. వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలు కరెంట్‌ వాడితే సర్‌ఛార్జీ విధించిన ఘనత ఆ ప్రభుత్వానిదన్నారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ కొరత ఉండేది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కరెంట్‌ కొరత లేకుండా చేసి.. జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్‌ సాధించిన రాష్ట్రంగా మార్చాను అన్నారు.

ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజనా నుంచి రూ.9 వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-24 మధ్య అసమర్థ పాలనతో రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసేసిందని.. ఆ విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందని గుర్తుచేశారు. దావోస్‌లోనూ దీనిపై చర్చ జరిగిందన్నారు. మీటర్‌ రీడింగ్‌ కోసం స్పాట్‌ బిల్లింగ్‌ తీసుకొచ్చాం. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశా.. ప్రపంచ బ్యాంకు జీతగాడు అని నాపై విమర్శలు చేశారు అని చంద్రబాబు అన్నారు. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కరెంట్‌ కొరత లేకుండా చేసి.. జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్‌ సాధించిన రాష్ట్రంగా మార్చాను. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 9 గంటలు వ్యవసాయానికి కరెంట్‌ ఇస్తున్నాం. నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యేసరికి 10 నుంచి 15 గంటల పాటు కరెంట్‌ కోతలుండేవి. పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించా.. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లా అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Telangana Assembly : స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్‌ఎస్

 

 

  Last Updated: 13 Mar 2025, 03:25 PM IST