Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వ‌ర‌ద నీరు.. మూడు గేట్లు ఎత్తివేత‌

శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది

  • Written By:
  • Updated On - September 6, 2022 / 09:03 AM IST

శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,19,093 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతుండగా, నాగార్జున సాగర్‌కు 10 అడుగుల మేర మూడు గేట్లను తెరిచి 83,949 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడికాలువ వద్ద విద్యుత్ ఉత్పత్తి అనంతరం స్పిల్‌వే ద్వారా 66,566 క్యూసెక్కుల నీరు, 95,562 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తికి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయం నుంచి 1,60,129 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589.10 అడుగులు కాగా గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా 312.0450 టీఎంసీల నీటి నిల్వకు గాను 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది.