YS Viveka Murder Case : కీలక సాక్షి ఆరోగ్యం విషమం

గత కొద్దీ రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు

Published By: HashtagU Telugu Desk
Ranganna Health Condition C

Ranganna Health Condition C

వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో కీలక సాక్షి అయినా వాచ్ మెన్ రంగన్న (Watchman Ranganna) ఆరోగ్యం విషమం (Health Condition Critical)గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొద్దీ రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న.. ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని కోర్టు ఇచ్చిన 164 స్టేట్ మెంట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఈయన్ను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తో హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల నివాసంలో వైఎస్‌ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు ఈ కేసులో నిందితులను గుర్తించి జైలుకు పంపగా , కొందరు బెయిల్‌పై బయట ఉన్నారు. కేసులో నిందుతుల్లో ఒకరైన అవినాష్‌రెడ్డి కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి విజయం సాధించారు. మరో నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారారు. వివేకా హత్య కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ నిలిచిపోయింది. సీబీఐ కోర్టులో మాత్రం ప్రతీ వారం విచారణ జరుగుతోంది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read Also : Betel Leaf: భోజనం చేసిన తర్వాత తమలపాకు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  Last Updated: 03 Jul 2024, 05:40 PM IST