Warden’s Husband Rapes Students..? : దేశ వ్యాప్తంగా మహిళలకు , అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది జరిగేలాలేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే కాదు స్కూల్ , హాస్టల్స్ ఇలా ప్రతి చోట ఇదే జరుగుతుంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్ (Dayananda Saraswati Hostel)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ లో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ (Shasi Kumar) విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నట్లు బయటకు వచ్చింది.
బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశి కుమార్.. ప్రైవేట్ గా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్ కు తన భార్య మణిశ్రీని వార్డెన్ గా పెట్టి నడిపిస్తున్నాడు. అయితే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్ లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది విద్యార్ధినిలు ఉన్నారు. ప్రైవేట్ గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ, ఫోటో షూట్స్, కోచింగ్ వంటి మాయ మాటలతో విద్యార్థినులపై లైంగిక దాడికి శశి కుమార్ పాల్పడుతున్నాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్ కు వెళ్లి విచారించగా విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. తమనూ లైంగికంగా వేధించారని హాస్టల్ లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోయారు. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్‌కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్‌కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Also : Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు