AP Politics: ఏపీ `గ‌లీజు` పాలి`ట్రిక్స్` కు `శీల‌`ప‌రీక్ష‌

ఏపీ పాలిటిక్స్ గ‌లీజుగా మారింది. ప్ర‌ధాన పార్టీల లీడ‌ర్లు వాడే ప‌ద‌జాలాన్ని వినలేక‌పోతున్నాం. హ‌ద్దులు దాటిన బూతులు విన‌డానికి కంప‌రం పుట్టిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 04:40 PM IST

ఏపీ పాలిటిక్స్ గ‌లీజుగా మారింది. ప్ర‌ధాన పార్టీల లీడ‌ర్లు వాడే ప‌ద‌జాలాన్ని వినలేక‌పోతున్నాం. హ‌ద్దులు దాటిన బూతులు విన‌డానికి కంప‌రం పుట్టిస్తున్నాయి. అమ్మ మొగుడుతో ప్రారంభ‌మై `ఎక్క‌డో పొర్లాడితే పుట్టిన బిడ్డ లోకేష్ అంటూ ప‌రోక్షంగా భువ‌నేశ్వ‌రి `శీలం`పై మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని వాడిని `బూతు` ప‌ద‌జాలం స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ఉంది. ప్ర‌తిగా ఆయ‌న మీద `అమ్మ‌, అక్క‌, ఆలీ, ల‌..కొడ‌కా..ఒక అమ్మ‌..పుట్టావా..ఎవ‌రు XXXX ..పుట్టావ్..నీ అమ్మ‌..ఎక్క‌డ XXXకుంటే, ఎంత మందితో XXకుంటే…`ఇలా రాయ‌డానికి వీల్లేని జుగుస్సాక‌ర‌ భాష‌ను టీడీపీ వాడుతోంది. ప‌లు సంద‌ర్భాల్లో ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన నేత‌లు వాడే ప‌ద‌జాలాన్ని స‌గ‌టు మ‌నిషి ఏవ‌గించుకుంటున్నాడు.

ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి శీలం మీద చ‌ర్చ జ‌రిగే వ‌ర‌కు ఇటీవ‌ల వెళ్లింది. ఆ మాట‌ల‌ను విన‌లేక చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ త‌రువాత మీడియా ముందు బోరున ఏడ్చి అసెంబ్లీని శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించిన విష‌యం విదిత‌మే. అసెంబ్లీలో జ‌రిగిన `శీలం` వ్య‌వ‌హారాన్ని ముందుగా ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక ప్రైవేటు ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో ఆ మ‌ధ్య‌ ప్ర‌స్తావించారు. ఆనాటి నుంచి ఆమె శీలంపై గాసిప్స్ ప‌లు ర‌కాలుగా సోష‌ల్ మీడియాను ముంచెత్తాయి. చివ‌రకు వ‌ల్ల‌భనేని వంశీని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి వెలివేసే వ‌ర‌కు వెళ్లింది. ఫ‌లితంగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో ఆ వివాదం తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగింది.

Also Read:   KA Paul Party: కేఏ పాల్ కు ‘ఈసీ’ షాక్.. పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

తాజాగా మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు భువ‌నేశ్వ‌రి `శీలం`పై ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. `ఎక్క‌డో పొర్లితే పుట్టిన `210 గాడిని త‌న ఇంటిలో పుడితే చాలని అనుకునే 420 గాడు `అంటూ చంద్ర‌బాబు, లోకేష్ ల‌పై అస‌హ్యంగా కొడాలి నోరుపారేసుకున్నారు. ప్ర‌తిగా రెండు రోజులుగా టీడీపీ బూతుల బ్యాచ్ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు సతీమ‌ణి, ఆయ‌న కుమార్తెలు, ఆయ‌న త‌ల్లి పుట్టుక‌ల నుంచి ఎవ‌రు XXతే పుట్టారో చెప్పాల‌ని అస‌భ్యంగా తిడుతూ మీడియా ముందుకొచ్చారు.

Also Read:   AP Politics: ఏపీపై రేణుకా, కేసీఆర్ కాంబినేష‌న్ ?

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు తొలుత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇలాంటి బూతుపురాణంకు ఐదేళ్ల క్రితం నాంది పలికారు. ఆనాడు శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ త‌దిత‌రుల మీద బూతులు తిడుతూ వాటిని రాజ‌కీయ వేదిక ఎక్కించారు. `మాథ‌ర్ XXX` అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద చేసిన వ్యాఖ్య‌ల దుమారం అప్ప‌ట్లో హ‌ద్దుల దాటిని బూతుల వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌రువాత ఇళ్ల‌లోని మ‌హిళ‌ల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి – కోటి వ్య‌వ‌హారం, ప్ర‌భాస్ – ష‌ర్మిల్ పై గాసిప్స్, ప‌వ‌న్ – పూన‌మ్ కౌర్ ప్రేమ.. ఇలా అనే అంశాల‌ను రాజ‌కీయ కోణం నుంచి తీసుకు రావ‌డం ద్వారా ఏపీ రాజ‌కీయాన్ని కంపులేపారు.

Also Read:   AP Politics: ఏపీపై `పీకే-కేసీఆర్` ఆప‌రేష‌న్

తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి లిక్క‌ర్ స్కామ్ గురించి టీడీపీ ప్ర‌స్తావించింది. రెండు వారాలుగా ఆమెను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాను టీడీపీ కార్య‌క‌ర్త‌లు నింపేశారు. ప్ర‌తిగా సీన్లోకి వ‌చ్చిన కొడాలి నాని ఏకంగా భువ‌నేశ్వ‌రి శీలాన్ని అవ‌మానిస్తూ చంఢాలంగా మాట్లాడారు. దీంతో రెండు రోజుల నుంచి టీడీపీ బూతుల విభాగం కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబంలోని మ‌హిళ‌ల‌ శీలాన్ని బ‌జారుకీడ్చారు. ఇలాంటి బూతుల‌ రాజ‌కీయాన్ని చేస్తోన్న జ‌నసేన‌, టీడీపీ, వైసీపీ పార్టీల గుర్తింపును ర‌ద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేయ‌డానికి మ‌హిళా, ప్ర‌జా సంఘాలు కొన్ని సిద్ధం అవుతున్నాయ‌ని తెలుస్తోంది. ఏపీ ప‌రువు తీస్తోన్న ఇలాంటి రాజ‌కీయ పార్టీల‌ను శాశ్వ‌తంగా బ‌హిష్కంచే చ‌ట్టం కావాల‌ని ప‌లువురు కోరుకోవ‌డంలో త‌ప్పులేదేమో!