రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట మరోసారి నిజమైంది. వైసీపీ (YCP) లో కీలక నాయకుడిగా పేరుపొందిన విజయసాయిరెడ్డి (VijayasaiReddy), ఇటీవల పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయసాయిరెడ్డికి జగన్‌తో చాలా కాలంగా అనుబంధం ఉండగా, ఇప్పుడు వారి మధ్య విభేదాలు పెరిగినట్టుగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పటికీ, తొలుత ఆయన జగన్ లేదా ఆయన కుటుంబంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ, ఇటీవల జగన్ (Jagan) లండన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేకెత్తించాయి. జగన్ “రాజకీయాల్లో క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా విజయసాయిరెడ్డికి సంబంధించి ఉన్నాయని అంతా అనుకున్నారు.
Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?
ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి వెంటనే తనదైన శైలిలో స్పందించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని, భయపడే స్వభావం తనకు లేదని, అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను వదులుకుని రాజకీయాల నుంచి తప్పుకున్నానని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా రాసుకొచ్చారు. ఈ స్థాయిలో ఆయన స్పందించడాన్ని చూసి వైసీపీ నేతలు, పార్టీ కేడర్ ఆశ్చర్యపోయారు. జగన్, విజయసాయిరెడ్డి మధ్య ఏమైందో తెలియక నేతలు చర్చించుకోవడం మొదలైంది. విజయసాయిరెడ్డి వైసీపీని వీడి భవిష్యత్తులో బీజేపీలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత, బీజేపీ పెద్దలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై జగన్‌కు సమాచారం చేరడంతో, ఆయన విజయసాయిరెడ్డిని తీవ్రంగా మందలించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు విజయసాయిరెడ్డి మౌనంగా ఉండి, చివరికి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం రాజుకున్న నేపథ్యంలో, వైసీపీ ఈ అంశంపై మరింత స్పందిస్తుందా? లేక భవిష్యత్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. తగ్గనున్న లోన్ ఈఎంఐలు!
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025