Site icon HashtagU Telugu

Pithapuram : పిఠాపురంలో ధర్నాకు దిగిన ఓటర్లు..

Voters Went On Dharna In Pithapuram

Voters Went On Dharna In Pithapuram

మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకానున్న తరుణంలో పిఠాపురం(Pithapuram )లో ఓటర్లు ధర్నా (Voters Dharna) కు దిగడం వార్తల్లో హైలైట్ అవుతుంది. ఏపీలో ఎన్నో చోట్లా పోలింగ్ ఒకెత్తు..పిఠాపురంలో ఒకెత్తు. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడమే. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి చెందిన పవన్..ఈసారి పిఠాపురం నుండి బరిలోకి దిగడంతోఆయన గెలుస్తాడా..లేదా అని మొదటి నుండి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని..లక్ష మెజార్టీ తో గెలుపొందపోతున్నాడని అన్ని సర్వేలు చెపుతున్నాయి.

ఇదిలా ఉంటె వైసీపీ నేతలు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి పలు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొండెవరంలో ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డు పై ధర్నా చేపట్టారు గ్రామస్తులు. నిన్నటి నుండి వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు సొంటివారి పాకల, ఇందిరా కాలనీ గ్రామస్తులు. స్థానిక వైసీపీ నాయకుడు దాదాపు 100 కుటుంబాలకు చెందిన డబ్బులు నొక్కేశాడని ఆరోపణలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈసారి ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రెండు రోజుల ముందు నుండే ఏపీకి ప్రజలు బారులు తీరారు. బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఆఖరికి ఎయిర్ పోర్ట్ లు సైతం జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ , చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వారే కాదు..ఇతర కంట్రీలలో ఉన్న ఏపీ వాసులు సైతం సొంతర్లకు వస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి ఈసారి ఓటు వేసేందుకు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు మే 13 న ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల అధికారులు సైతం ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. ఈసారి ఎన్నికల హోరు కూడా గట్టిగా ఉంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాల్లోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తోంది. అటు, అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి.. వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Read Also : Lok Sabha Elections : తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలను పట్టించుకోని ఓటర్లు..