Site icon HashtagU Telugu

Kadapa : షర్మిలను గెలిపించండి – విజయమ్మ

YS Vijayamma

YS Vijayamma

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ కు మరికొద్ది గంటల సమయమే మాత్రమే ఉన్న సమయంలో వైస్ విజయమ్మ (YS VIjayamma) ..కడప లో షర్మిల (Sharmila) ను గెలిపించాడని అంటూ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం విజయమ్మ..అమెరికా లో ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెల క్రితం ఆమె అమెరికా కు వెళ్లడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీ లో రాజకీయాలంటే వైస్ కుటుంబంలో బయటపడుతున్న విభేదాలు కాకరేపుతున్నాయి. సొంత చెల్లెను జగన్ మోసం చేసాడని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని షర్మిల చెపుతూ వస్తుంది. మరి వీరికి ఎక్కడ విభేదాలు వచ్చాయో క్లారిటీ లేదు కానీ..గత కొద్దీ నెలలుగా జగన్ Vs షర్మిల మధ్య వార్ నడుస్తుంది. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గరి నుండి కూడా షర్మిల..తన ప్రతి ప్రసంగంలో వివేకా హత్య గురించి మాట్లాడుతూ..జగన్ , అవినాష్ రెడ్డి లపై విమర్శలు , సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. వివేకా హత్య చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొస్తున్నాడని పరోక్షంగా అవినాష్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కడప బరిలో వైసీపీ నుండి అవినాష్ , కాంగ్రెస్ నుండి షర్మిల బరిలో నిల్చున్నారు. దీంతో ఈసారి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో అని అంత ఎదుచూస్తున్నారు. ఈ తరుణంలో తన కూతురికి మద్దతు తెలిపి విజయమ్మ తల్లి ప్రేమను వ్యక్తం చేసింది.

కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. ‘వైఎస్ఆర్ ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డను గెలిపించి పార్లమెంట్ కు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. YSRను ఆదరించినట్లే షర్మిలనూ కడప ప్రజలు ఆదరించాలి. వైఎస్ ల కడప ప్రజలకు సేవచేసే అవకాశం షర్మిలకూ కల్పించాలి’ అని విజ్ఞప్తి చేస్తూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

Read Also : Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరెంట్ కోతలు మొదలయ్యాయి – కేసీఆర్