Site icon HashtagU Telugu

Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు

Chandrababu

Chandrababu

Chandrababu: వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల జీతాలు పెంచుతామన్నారు. అలాగే సమాజ ద్రోహాలను ఆదరించకుండా ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలని వాలంటీర్లను కోరారు.

ఈ రోజు శుక్రవారం బనగానపల్లె పట్టణంలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.అనేక మంది వాలంటీర్లు బాగా చదువుకున్నారు కానీ దురదృష్టవశాత్తు వారికి చాలా తక్కువ జీతం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారని భయపడవద్దని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. తాము ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన వాలంటీర్లకు కనీసం నెలకు రూ.50 వేలు ఆదాయం వచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.

We’re now on WhatsAppClick to Join.

తమ ప్రభుత్వం మూడు ఎల్‌పిజి సిలిండర్లను ఉచితంగా అందజేస్తుందని మహిళలకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మెగా డీఎస్సీ ప్రకటించడమే కాకుండా నిరుద్యోగ భృతికి రూ.3000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు 12 డీఎస్సీలు నిర్వహించగా, నేను 9, మాజీ సీఎం ఎన్టీ రామారావు 3 డీఎస్సీలు నిర్వహించారని గుర్తు చేశారు. అయితే జగన్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు.

Also Read: CM Jagan : మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది