వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచింది. స్టీల్ ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరింది. ఈ పరిశ్రమలో 1990 నవంబర్లో ఉత్పత్తిని ప్రారంభించారు. నేటికి 100M టన్నుల మైలురాయిని చేరుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది 7.2M టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ముడి సరకు కొరత వల్ల 2, 3 బ్లాస్ట్ ఫర్నేస్లు మాత్రమే పనిచేస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైజాగ్ స్టీల్ (Vizag Steel) గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం , భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. వైజాగ్ నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ తమనంపల్లి అమృతరావు మరణ నిరాహారదీక్షతో “విశాఖఉక్కు ఆంధ్రులహక్కు” అనే 1966 అక్టోబరు, 15న ప్రారంభమైంది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలు 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించాడు.
ప్రస్తుతం ఈ చారిత్రక ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ట్రై చేస్తున్నప్పటికీ.. ఆ అవసరం లేదని గుర్తుచేస్తూ తమ సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ చాటి చెపుతూ వస్తుంది. స్టీల్ ప్లాంట్ స్థాపన నుంచి ఇప్పటివరకూ ఉక్కు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. తాజాగా కేంద్రమంత్రి కుమారస్వామి సందర్శన తర్వాత ఈ రికార్డు నమోదు కావడం విశేషం. 1990లో పూర్తిస్దాయిలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రైవేటీకరణ జాబితాలో చేరిన ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్లాంట్ ఈ రికార్డు అందుకోవడం విశేషం.
Read Also : Heart Patiants : హార్ట్ పేషెంట్లు జిమ్‌లో ఈ తప్పులు చేయకూడదు, ఈ విషయాలు గుర్తుంచుకోండి..!