విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ(Vizag Steel) అంశాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్లు అనుకూలంగా మలచుకుంటున్నారు. క్రౌడ్ ఫండింగ్ (Crowd Funding)అంటూ ఇప్పుడు వీవీ లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు. ప్రజా సొమ్ముతో విశాఖ ఉక్కు కొనుగోలు చేయడానికి సిద్దమంటూ సినిమా స్టైల్ లో ఆయన ప్రకటించారు. ఎంత వరకు సాధ్యం? గతంలో క్రౌడ్ ఫండింగ్ తో ఎప్పుడైనా కంపెనీల కొనుగోలు జరిగిందా? ఇలాంటి అంశాలు ఏమీ పట్టించుకోవలేదు. ఏదో సినిమా డైలాగ్ మాదిరిగా లక్ష్మీనారాయణ క్రౌడ్ ఫండింగ్ పదాన్ని ఉపయోగించారు. ఇప్పుడు అలా సాధ్యపడుతుందా? లేదా అంటూ విశాఖ ఉక్కు సీఎండీకి లేఖ రాయడం విచిత్రం.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ(Vizag Steel)
ఐపీఎస్ పూర్తి చేసిన విద్యావంతుడు వీవీ లక్ష్మీనారాయణ. అంతేకాదు, సీబీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్ గా పనిచేశారు. ఎంతో మంది క్రిమినల్స్ ను, ఆర్థిక ప్రాండ్ లను, కంపెనీల అక్రమాలను బయటపెట్టే సంస్థలో పనిచేశారు. అంతటి గొప్ప మేధావిగా ఉన్న లక్ష్మీనారాయణకు ఏమైయింది? అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి వచ్చింది. కారణంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ(Vizag Steel) మీద అందరిలాగా ఆయన కూడా కుప్పిగంతులు వేయడమే. అంతేకాదు, కేఏ పాల్ లాంటి అపరమేధావితో కలిసి పోరాటం చేయడానికి దిగారు. కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడానికి కేఏ పాల్ పనికొస్తారని ఆయన నమ్ముతున్నారు. ప్రజలు కూడా విశ్వసించాలని కోరుకోవడమే లక్ష్మీనారాయణ నవ్వుల పాలు కావడానికి ప్రధాన కారణం.
కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడానికి కేఏ పాల్
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ (Vizag Steel) అంశాన్ని తీసుకుని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత ఏడాది కుప్పిగంతులు వేశారు. పార్టీకి రాజీనామా చేసి ఉద్యమిస్తానంటూ మీడియా ముందుకు ప్రకటించారు. కానీ, ఏనాడూ ఆయన క్షేత్రస్థాయి పోరాటాల్లో కనిపించలేదు. కేవలం వైసీపీ ఒత్తిడిని తట్టుకుని నిలబడేందుకు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని వాడుకున్నారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ పంచన చేరారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ రైల్వే జోన్ అంశాన్ని నెత్తికెత్తుకుని 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో లాభపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వేగంగా కేంద్రం ముందుకు తీసుకెళ్లడానికి సహకారం అందించారు. అదే సమయంలో ఓపెన్ బిడ్డింగ్ లో ఏపీ ప్రభుత్వం పాల్గొని ప్రైవేటు కాకుండా చూస్తానని ఆ మధ్య హామీ ఇచ్చారు. నిజమేనని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించారు. సీన్ కట్ చేస్తే, తాజాగా గురువారం ముగిసిన టెండర్లలో కనిపించలేదు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా విశాఖ ఉక్కును కాపాడుకోవాలి (Vizag Steel)
తాజాగా లక్ష్మీనారాయణ అయోధ్య రామమందిరం తరహా క్రౌడ్ ఫండింగ్ (Crowd Funding)వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. పబ్లిక్ మనీ ద్వారా రామ మందిరాన్ని ఎలా నిర్మించారు? అనేది అందరికీ తెలిసిందే. విరాళాలను భారీగా సేకరించడం ద్వారా ధార్మిక కార్యక్రమాన్ని చేశారు. అదే తరహాలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా విశాఖ ఉక్కును (Vizag Steel)కాపాడుకోవాలి అనే కాన్సప్ట్ ను లక్ష్మీనారాయణ ఎంచుకున్నారు. వినడానికి బాగుందిగానీ కంపెనీల చట్టాలు, ధార్మిక కార్యక్రమాల మార్గదర్శకాలు వేరని ఆయన తెలుసుకోకపోవడం గమనార్హం.
Also Read : Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `కల్వకుంట్ల`తో అంతే.!
గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత లక్ష్మీనారాయణ ఎలాగైనా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ(Vizag Steel) అంశం అస్త్రంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పాదయాత్ర చేస్తూ కార్మికులకు మద్ధతుగా నిలిచారు. అంత వరకు బాగానే ఉంది. ఇటీవల సింగరేణి తరపున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను అడ్డుకుంటూ బిడ్ వేస్తానని కేసీఆర్ అన్నారు. వెంటనే లక్ష్మీనారాయణ కేసీఆర్ జేజేలు పలికారు. ఆ రోజు నుంచి లక్ష్మీనారాయణ మీద విమర్శల వర్షం కురుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారని బీజేపీ ఏపీ లీడర్లు ప్రచారం మొదలు పెట్టారు. తాజా కేఏ పాల్ తో కనిపించడంతో లక్ష్మీనారాయణకు ఏమైయిందని ప్రశ్నించుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీలోకి వెళుతున్నారని కొందరు భావిస్తున్నారు. ఆయన పొలిటికల్ ప్రయాణం ఏమోగానీ, రామమందిరం నిర్మాణం తరహాలో విశాఖ ఉక్కు ప్రైవేటకరణకు వ్యతిరేకంగా క్రౌడ్ ఫండింగ్ ను (Crowd Funding)ఉపయోగించాలని ఆయన చేసిన డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.