Site icon HashtagU Telugu

Vizag Serial Murders : వ‌ణుకుతున్న విశాఖ ప్ర‌జ‌లు.. కార‌ణం ఇదే..?

Visakhapatnam GVMC

Visakhapatnam GVMC

విశాఖ వాసులు వ‌ణికిపోతున్నారు. న‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌లతో ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా విశాఖ పెద్ద పెద జాలరిపేట లో దారుణ హత్య జ‌రిగింది. భార్య భర్తల పై కత్తితో దుండ‌గులు దాడి చేశారు.భ‌ర్త మృతి చెంద‌గా,..భార్యకు తీవ్రగాయాలైయ్యాయి. ఈ కేసులో నిందితుడు పొలరాజు గా గుర్తించిన పోలీసులు. విశాఖలోని పెందుర్తి ఏరియాలో ఒక్క సైకో కిల్లర్ చేసిన సీరియల్ కిల్లింగ్స్ ను పక్కనబెడితే అంతకు ముందు, ఆ తరువాత జరిగిన హత్యల్లో పాత నేరస్తులూ లేదా రౌడీ షీటర్ల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.  విశాఖ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, నేరాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న గాక మొన్న వరుసగా మూడు హత్యలు చేసిన సైకో కిల్లర్ ను అరెస్ట్ చేశారని ఊపిరి పీల్చుకునేలోపే, ఆ కొద్దీ రోజుల్లోనే ఎంవీపీ కాలనీలో జరిగిన అనిల్ కుమార్ అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. కాకినాడలో 2017 లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అనిల్ కుమార్ తనకు ముప్పు ఉంటుందన్న భయం తో వైజాగ్ కు వచ్చేశాడు. ఇటీవల లోకల్ గా జరుగుతున్న చిన్న చిన్న సెటిల్ మెంట్‌లలో తలదూర్చడం, ఈ క్రమంలో ఆదర్శ్ నగర్ లో ప్రవేట్ బస్సు నడుపుకునే శ్యామ్ ప్రకాష్ తో ఏర్పడిన ఆధిపత్య గొడవల్లో భాగంగా శ్యామ్ ప్రసాద్ మరో ఇద్దరితో కలిసి అనిల్ కుమార్‌ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల్లో రౌడీ షీటర్ల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.